Just In
- 3 min ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 59 min ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
- 1 hr ago
ఆ విషయాల్లో ఎప్పుడూ ఆలస్యం అనేది ఉండదు.. సింగర్ సునీత పిక్స్ వైరల్
- 2 hrs ago
మరో మాస్ యాక్షన్ సినిమా కోసం తమిళ దర్శకుడిని లైన్ లో పెట్టిన రామ్
Don't Miss!
- News
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సలాం విశాల్...! తెలుగోడి ప్రేమకు కరిగిపోయిన తమిళ అభిమానులు
ఒక మనిషి తన వృత్తిరీత్యా గొప్ప స్టార్ కావొచ్చు, మరెంతో గొప్ప పదవిలో ఉండొచ్చు ఏదైనా రంగం లో ప్రపంచం లో అందరికన్నా ఉన్నతుడు కావొచ్చు. అయితే ఆ కీర్తీ, అధికారం అంతా అదనపు హంగులే అవన్నీ తీసేసి చూస్తే ప్రతీ ఒక్కరూ సాధారణ మనుషులే. ఇదే విషయాన్ని మన సినీ హీరోలు పదే పదే నిరూపిస్తూనే ఉంటారు. ఒక హీరో క్యాన్సర్ తో ఉన్న అభిమాని దగ్గరకు వెళ్లి ఆనందపెట్టినా., మరో కుటుంబాన్ని ఆదుకోవటానికి నడీ రోడ్డుమీద పానీ పూరీ అమ్మినా.., ఆటో నడిపినా తానూ సాధారన మనిషినే అని గుర్తు చేసేందుకూ, మిగతావారికీ గుర్తు చేసేందుకే.
ఆమధ్య చెన్నై లో వరదలు వచ్చినప్పుడు తమిళ సినీ పరిస్రమ మొత్తం రోడ్ల మీదికొచ్చింది తెరమీద కనిపించే హీరో నిజమైన హీరోలై సాధారన జనం కోసం రోడ్ల మీదా, నడుములోతు నీళ్ళలో నిలబడి సహాయం చేసారు. అప్పుడు వాళ్ళలో ఉన్న స్టార్ విశాల్ కూడా. అయితే విశాల్ కి అలా జనం కోసం పని చేయటం అదే మొదటి సారీ కాదు, చివరి సారీ కాదు.ఈ మధ్య మరో చిన్నారి విషయం లో విశాల్ చూపిన చొరవ మామూలుది కాదు. విశాల్ హృదయం ఎంత విశాలమో నిరూపించే సంఘటన ఏమిటంటే...

చెన్నైలో ఉంటూ ఆటో నడిపేవాడు
తమిళనాడులోని తిరుత్తణి సమీపంలోని అకూర్ గ్రామానికి చెందిన ఆర్ముగం అదే ప్రాంతానికి చెందిన పుష్ప అనే యువతిని 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి మనీషా(07), రంజన(05) ఇద్దరు కుమార్తెలు. భార్య, కుమార్తెలు తిరుత్తణి, అకూర్‌లో నివసిస్తుండగా ఆర్ముగం చెన్నైలో ఉంటూ ఆటో నడిపేవాడు., , రాత్రింబవళ్లు అద్దె ఆటో నడిపే ఆర్ముగంకు ఆటో యజమాని రోజుకు రూ.300 ఇచ్చేవాడు. ఈ సంపాదనతో ఆర్ముగం కుటుంబం ఆనందంగా గడిపేది.

కుమార్తెను చంపి ఆపై ఆత్మహత్య చేసుకుంది
ఏం జరిగిందో ఏమోగానీ భార్యభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ తగాదాల కారణంగా ఆర్ముగం భార్య పుష్ప గత మే నెలలో తన చిన్న కుమార్తె రంజనను చంపి ఆపై ఆత్మహత్య చేసుకుంది. తల్లి చెల్లిని కోల్పోయిన మనీషా తన అవ్వ మంజుల దగ్గర ఉంటోంది. భార్య కుమార్తెల మృతితో ఆర్ముగం దిక్కులేనివాడయ్యాడు. అయినా మనీషా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తిరిగి చెన్నై వ చ్చి ఆటో నడపడం ప్రారంభించాడు.,

ఆర్ముగం మృతి చెందాడు
అ క్రమంలో గత 18న ఆల్వార్‌పేట రాధాకృష్ణన్ రోడ్డుపై ఆటోలో నిద్రిస్తుండగా ఇంకో విశాదం చోటు చేసుకుంది.. వికాస్ అనే యువకుడు మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు పక్కన నిలిపిఉన్న 12 ఆటోలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ఆటోడ్రైవర్లు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిలో ఆర్ముగం చికిత్సలు ఫలించక మృతి చెందాడు. దీంతో చిన్నారి మనీషా ఒంటరిగా మిగిలింది. మూడు నెలల క్రితం తల్లిని, చెల్లిని కోల్పోయి బాధలో ఉన్న చిన్నారి మనీషా తండ్రి మృతి చెందిన విషయాన్ని తట్టుకోలేక బోరున విలపిస్తోంది.,

నాన్న ఇంక రాడా?
నాన్న చెన్నై నుంచి ఎప్పుడు వస్తాడు? ఇంక రాడా? అంటూ అవ్వను ప్రశ్నించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఇలా ఉండగా ఆళ్వార్ పేటలో మద్యం తాగి అతివేగంగా కారు నడిపి ఆర్ముగం మృతికి కారకుడైన వికాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు భవిష్యత్తులో కారు రేస్‌లో పాల్గొనడానికి వీలులేదని ఫెడరేషన్ ఆఫ్ మోటర్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.

విశాల్ సమాధానంచెప్పాడు
ఇక్కడివరకూ బాగానే ఉంది కానీ మరి ఆ పాప పరిస్థితేమిటీ?? ఇదే ప్రశ్నకి సమాధానం విశాల్ చెప్పాడు. సినిమాలో నే కాదు మనిషిగా కూడా తాను హీరో అని నిరూపించాడు. ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ ఆర్ముగం కుమార్తె మనీషా చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను దేవి ట్రస్ట్ ద్వారా భరిస్తానని ప్రకటించాడు. ఈ విషయమై ఆయన ఆర్ముగం ఇంటికి వెళ్లి మనీషా అవ్వ మంజులను పరామర్శించి, ధైర్యం చెప్పాడు.

ఆయన చల్లగా ఉండాలి
మనీషా (7) చదువుకయ్యే ఖర్చును ఒక అన్నయ్యగా భావించి తానే పూర్తిగా భరించనున్నట్లు విశాల్ ప్రకటించటం తో ఒక్కసారిగా తమిళుల్లో విశాల్ అంటే మరింత అభిమానం పెరిగింది. అంతేకాక ఆ కుటుంబ పోషణకు ఏదైన ఒక కిరాణ షాపు ఏర్పాటు చేసేలా చూస్తానని విశాల్ హామీ ఇచ్చారు. ఈ సంఘటన వివరాలు తెలియగానే అకూర్ గ్రామానికి చెందిన ప్రజలంతా విశాల్ మీద పెద్ద ఎత్తున పూజలు జరిపించారట. "విశాల్ నిజంగా హీరోనే ఆయన తన మంచిమనసునీ తనకు మేలు చేసిన తమిళ అభిమానులనీ ఎప్పటికీ మరిచిపోలేదు ఆయన చల్లగా ఉండాలి" అంటూ ఒక లోకల్ పత్రికలో ఉద్వేగంగా మాట్లాడారట ఆ ఊరి జనం. ఇంత మంచి మనసు ఉంది కాబట్టే ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉండే తమిళులు కూడా విశాల్ తెలుగు వాడైనా అతన్ని తమ వాడుగా చేసుకున్నారు.

మొదటి సారి కాదు
అయితే విశాల్ ఇలా సహాయం చేయటం ఇదే మొదటి సారి కాదు చెన్నై వరదల సమయం లో రోడ్లమీద తిరుగుతూ విఒశాల్ చేసిన సహాయ కార్యక్రమాలని ఎవరూ మరిచిపోలేదు. అయితే ప్రత్యక్షంగా చూసి, పక్కనే జరిగినప్పుడు స్పందించటం వేరు ఇలా ఎక్కడో జరిగిన సంఘటనలకు కూడా తాను వెళ్ళి సహాయం చేయటం విశాల్ కే చెల్లింది

పేపర్ లో ఒక రైతు కష్టాన్ని చదివి
ఇంతకు ముందు కూడా పేపర్ లో ఒక రైతు కష్టాన్ని చదివి అతనికి సహాయం చేసాడు విశాల్. తమిళనాడు లోని తంజావూరు ప్రాంతానికి చెందిన బాలన్ అనే రైతు బ్యాంకు లోన్ తో ట్రాక్టర్ కొని వ్యవసాయం చేసుకొంటున్నాడు. కాగా చేస్తున్న వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పటి దాకా చెల్లిస్తున్న రుణం తాలూకు వాయిదాలు నిలిచి పోయాయి. నెల నెలా చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించక పోవటం తో ఆ రుణం వసూలు చేసుకోవడానికి బ్యాంక్ అధికారులు బాలన్ ఇంటికి పోలీసులను వెంటబెట్టుకొని వెళ్లారు. ఆ రైతు బ్యాంక్ అధికారుల కాళ్లావేళ్లా పడ్డా వినకుండా.. అతని జీవనాధారమైన ట్రాక్టర్ ను తీసుకొని వెళ్లారు.

సలాం విశాల్ అనిపించటం లేదూ
ఈ వార్త తమిళ పత్రికల్లో వచ్చింది. ఈ వార్తను చూసిన విశాల్ వెంటనే స్పందించి "ఆ బాలన్ ఎవరో నాకు తెలియదు.. కానీ అతను ఒక రైతు అవ్వడం వల్లే అతనికి ఇలాంటి పరిస్తితి వచ్చింది. ఆ విషయం నాకు అర్ధమైంది. ఆ బాకీ నేను తీరుస్తాను మనస్థాపం చెందకండి" అని విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పటికే విశాల్ రీల్ హీరో కాదు రియల్ హీరో అని నిరూపించుకొన్నాడు. ఇటీవల తాను షూటింగ్ చేసే ప్రాంతంలోని గ్రామస్తుల ఇబ్బందులను గమనించి మరుగుదొడ్ల నిర్మాణానికి పూనకొన్న సంగతి తెలిసిందే... ఇదంతా చూసాక సలాం విశాల్ అనిపించటం లేదూ...