»   » కె‌ఎఫ్‌సి వారి సినిమాలో తమన్నా, కోన వెకంట్ ప్లానింగ్!

కె‌ఎఫ్‌సి వారి సినిమాలో తమన్నా, కోన వెకంట్ ప్లానింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కె‌ఎఫ్‌సి.... అనగానే ఎవరికైన ముందుగా మదిలో మెదిలేది రుచికరమైన చికెన్ లెగ్ పీసులు, కరకరలాడే చికెన్ వింగ్స్. కానీ ఇకపై తెలుగు వారు మాత్రం కె‌ఎఫ్‌సి అంటే అలా ఊహించుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలేమో. ఎందుకంటే కె‌ఎఫ్‌సి పేరుతో ఓ సినిమా నిర్మాన సంస్థ వచ్చేసింది.

తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్.....'కోన ఫిలిం కార్పొరేషన్' పేరుతో ఓ బేనర్ స్థాపించారు. దీన్నే షార్ట్ కట్ లో కె‌ఎఫ్‌సి అంటున్నారు. ఈబేనర్ లోగో కూడా కె‌ఎఫ్‌సి అని డిజైన్ చేసారు. ఈ బేనర్ మీద రాబోతున్న తొలి సినిమా ప్రకటించారు.

Kona Venkat Announced KFC With Tamanna

'అభినేత్రి' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ లోగో కూడా రిలీజ్ చేసారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రభుదేవాతో పాటు సోనూ సూద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

Kona Venkat Announced KFC With Tamanna

హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ తరహా చిత్రాలకు మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. తమన్నా నటించిన 'ఊపిరి' ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. దీంతో పాటు 'బాహుబలి2', తమిళంలో విజయ్ సేతు సరసన 'ధర్మదురై' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఊపిరి చిత్రానికి తమన్నా తొలిసారిగా సొంతగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది.

English summary
Kona announced new production house named KFC, which stands for Kona Film Corporation. Kona announced his first film on the banner which titled as Abhinetri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu