twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బ్రూస్ లీ’ ఎఫెక్ట్: శ్రీను వైట్లపై కోన వెంకట్ 10 కోట్ల కేసు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆ మధ్య ఓ సినిమా విషయంలో వచ్చిన మనస్పర్థలతో దర్శకుడు శ్రీను వైట్ల, స్టార్ రైటర్ కోన వెంకట్ విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే బ్రూస్ లీ సినిమా కోసం రామ్ చరణ్ ఇద్దరినీ కలిపాడు. ఈ సినిమాకు ఇద్దరూ కలిసి పని చేసారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం మళ్లీ చిరుగురించిందని అనుకున్నారు.

    అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరూ మళ్లీ విడిపోవడం ఖాయంగా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. శ్రీను వైట్ల మీద కోన వెంకట్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావే వేసేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ‘బ్రూస్ లీ' సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైన నేపథ్యంలో తనకు తప్పుడు క్రెడిట్ అపాదించే ప్రయత్నం చేస్తున్నారని కోన వెంకట్ వాదిస్తున్నట్లు సమాచారం.

    బ్రూస్ లీ సినిమా కోసం తాను అందించిన స్టోరీలో తన ప్రమేయం లేకుండా అనేక మార్పులు చేసారని, ఇపుడు సినిమా ప్లాపు కావడంతో తన స్టోరీ వల్లే సినిమా ప్లాప్ అయిందనే ప్రచారం చేస్తున్నారని కోన వెంకట్ ఆగ్రహంగా ఉన్నట్లు టాక్. తాను ఇచ్చిన ఒరిజినల్ స్టోరీ వాడకుండా, మార్పులు చేర్పులు చేసి ఇపుడు ఆ స్టోరీ తనదే తన పేరు బదనాం చేస్తున్నారని కోన వెంకట్ వాదిస్తున్నాడట.

    రైటర్ గా తన పేరు చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న శ్రీను వైట్ల నుండి పబ్లిక్ గా అపాలజీ కోరుతూ రూ. 10 కోట్ల డిఫామేషన్ సూట్ వేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను ఇచ్చిన ఒరిజినల్ స్టోరీని ఆన్ లైన్లో పెట్టేందుకు కూడా కోన వెంకట్ ట్రై చేస్తున్నారని, అప్పుడే మెగా అభిమానులకు, ప్రేక్షకులు నిజా నిజాలు తెలస్తాయని కోన వెంకట్ భావిస్తున్నారట.

    మరో వైపు ‘బ్రూస్ లీ' చిత్ర నిర్మాత డివివి దానయ్య కూడా రైటర్ కోన వెంకట్ కు మద్దతుగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెలుతుందో? హాట్ టాపిక్ అయింది. ఈ గొడవ పెద్దది కాకుండా రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నాడని, అవసరం అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు.

    బ్రూస్ లీ

    బ్రూస్ లీ


    కోన వెంకట్, గోపీ మోహన్ బ్రూస్ లీ సినిమా కోసం శ్రీను వైట్లతో కలిసి పని చేసారు. అంతకు ముందు కోన వెంకట్, శ్రీను వైట్ల విబేధాలతో విడిపోయారు. ‘

    ఆగడు

    ఆగడు


    కోన వెంకట్ లేకుండా శ్రీను వైట్ల ‘ఆగడు' సినిమా చేసి ఫెయిల్ అయ్యాడు.

    బాద్ షా

    బాద్ షా


    బాద్ షా' విజయంలో తనకు క్రెడిట్ ఇవ్వక పోవడంతో శ్రీను వైట్లతో కోన వెంకట్ విబేధించారు. రామ్ చరణ్ కోరడంతో బ్రూస్ లీ సినిమా కోసం కలిపి పని చేసారు.

    ముగ్గురు

    ముగ్గురు


    గతంలో శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీ మోహన్ కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వచ్చాయి.

    English summary
    Going by the reports, Kona Venkat is gearing up to file a 10 crore defamation suit on director Sreenu Vaitla for crediting him wrong in the movie Bruce Lee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X