అభిషేక్ బచ్చన్ కి తెలుగు రచయిత కథ

ఇక రచయితలు దర్శకులుగా మారడం ఇటీవల మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ జాబితాలోకి రచయిత కోన వెంకట్ వచ్చి చేరారు. 'రామ్ అండ్ జూలియట్' పేరుతో ఓ సినిమాకి దర్శకత్వం వహించారాయన. న్యూయార్క్ నేపథ్యంలో నూతన నటీనటులతో సాగే ప్రేమకథ ఇది. వరశీ మదిరాజు, రామ్ గోలి నిర్మాతలు. ఈ నెల 14న సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా కేవలం అంతర్జాలంలోనూ, టీవీల్లోనే విడుదల చేస్తున్నారు.
మరో ప్రక్క కోనవెంకటే ప్రసుతం మరికొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'పవర్' సినిమా స్క్రిప్ట్ కోసం ఎస్. రవీంద్రతో కలిసి పనిచేసాడు. అలాగే తను పనిచేసిన 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సంగతి పక్కన పెడితే వీలైనంత త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు కోన వెంకట్. ఈ విషయాన్ని ఆయన ఇటీవల స్వయంగా వెల్లడించారు. మంచి స్టోరీతో వస్తే తప్పకుండా దర్శకత్వం చాన్స్ ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కోన వెంకట్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా ఓ స్టోరీని ప్లాన్ చేసుకుంటున్న కోన వెంకట్.....ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో లేని విధంగా డిఫరెంటుగా, అందరికీ నచ్చే విధంగా, ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











