»   » దర్శకుడుగా కోన వెంకట్ ప్రాజెక్టు ఓకే...డిటేల్స్

దర్శకుడుగా కోన వెంకట్ ప్రాజెక్టు ఓకే...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ మొత్తానికి దర్శకుడుగా మారుతున్నారు. అయితే ఆయన పెద్ద హీరోను డైరక్ట్ చేస్తారనుకుంటే ..మొదట ఓ చిత్రం డైరక్ట్ చేసి తర్వాత పెద్ద హీరోతో ప్లాన్ చేస్తానని చెప్తున్నారు. వంశీ మాదిరాజు, రామ్ గోలి అనే ఇద్దరు ఎన్నారైలు ఆయన తో చిత్రం నిర్మిస్తున్నారు. లాఫింగ్ బుద్ద ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాకు న్యూయార్క్, న్యూజెర్శీలో ఉన్న ఎన్నారై నటులను తీసుకోనున్నారు. ఇందుకోసం ఆయన ట్విట్టర్ లో ప్రకటన చేసారు. ఆ ట్వీట్ లో .."న్యూయార్క్, న్యూజెర్సీలలో ఉన్న భారతీయ నటులను తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంట్రస్ట్ ఉన్న 20-30 లోపు యువతి యువకులు... తమ ఫోర్ట్ ఫోలియోని,ఫోటోతో కలిపి.. :info@laughingb.com," పంపండి అన్నారు.


ఇక దర్శకత్వం అనగానే పవన్ తో ప్రాజెక్టు అనుకున్నారు. అయితే కోన వెంకట్ ని మీడియా వారు..ప్రశ్నిస్తే..ఆయన సమాధానంతో ఈ ప్రాజెక్టుకి క్లారిటీ ఇచ్చారు. కోన వెంకట్ మాట్లాడుతూ... పవన్‌కల్యాణ్.. ఆయనతో సినిమా తీయాలనేది నా ఆశ, నా ఆశయం. మనసులో మాలిన్యం అనేది లేని మంచిమనిషి ఆయన. పర్సనల్‌లైఫ్‌ని, ప్రొఫెనల్ లైఫ్‌ని అస్సలు మిక్స్ చేసి చూడరాయన. ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ అది. ఒక వ్యక్తి దగ్గర టాలెంట్ ఉందంటే వాడు చుట్టం అయి ఉండక్కర్లేదు, ఫ్రెండవనక్కర్లేదు. చివరకు రోడ్డు మీద పోయేవాడైనా సరే.. పిలిచి మరీ అవకాశం ఇస్తాడు. చాలామందికి అవకాశం ఇచ్చాడు కూడా అన్నారు.

అలాగే... ప్రస్తుతం వాళ్లందరూ స్కోడా కార్లేసుకొని మన కంటి ముందే తిరుగుతున్నారు. దటీజ్ పవర్‌స్టార్. నేనోసారి 'కల్యాణ్ మీరు చాలామందికి అవకాశం ఇచ్చారు కదా.. నేను ఓ మంచి కథ తెచ్చుకుంటే నాకూ అవకాశం ఇస్తారా' అని అడిగా. 'ఎందుకివ్వను. ఇవ్వకపోవడానికి నాకేమైనా పిచ్చా. మంచి కథ తీసుకురా చేద్దాం' అన్నారు.

English summary
Kona Venkat is all set to turn director. He tweeted ... “Need only Indian artists preferably Telugu speaking Indians living in New York and New jersy areas. Interested artists (boys&girls) in the age group of 20-30 can mail ur portfolio to :infolaughingb.com,” Kona Venkat said on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu