For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు కథ చెప్పొద్దు. నేను వినను: ప్రభాస్

  By Srikanya
  |

  హైదరాబాద్: ''ప్లీజ్.. నాకు కథ చెప్పొద్దు. నేను వినను. వేరే హీరోకి చెబితే బెటర్. నేను ఆల్రెడీ రాజమౌళితో సినిమా చేయబోతున్నా'' అన్నారు. కానీ ఓసారి కథ వినమని అన్నాను. తీరా కథ విన్నాక ఎందుకు విన్నానా? అని ఫీలయ్యారాయన. దానికి కారణం ప్రభాస్‌కి కథ బాగా నచ్చడమే అంటున్నారు దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాధ్యాయ కాంబినేషన్‌లో వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా కొరటాల శివ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  అలాగే కథ విన్న ప్రభాస్... ఈ కథను వదులుకోవడం ఇష్టం లేక రాజమౌళి దగ్గర మాట్లాడారాయన. 'నా సినిమా ఆరంభం కావడానికి కొంచెం టైమ్ పడుతుంది. ఈలోపు ఈ సినిమా చెయ్యి' అని రాజమౌళిగారు అనడంతో 'మిర్చి' ఆరంభమైంది అని సినిమా ప్రారంభమైన నేపధ్యం వివరించారు. ఇక ప్రభాస్ ఓ డిఫరెంట్ హీరో. మాస్ ప్రేక్షకులు ఇష్టపడతారు. యూతేమో 'యూత్ ఐకాన్'లా చూస్తారు. ఫ్యామిలీస్ తమ కుటుంబంలో ఒకడిగా భావిస్తారు. అలాంటి ఇమేజ్ రావడం చాలా అరుదు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే అన్ని సెక్షన్లకు నచ్చిన అరుదైన హీరో ప్రభాస్ అన్నారు.

  మిర్చిలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారు అనే విషయం గురించి చెపుతూ... ఒక ప్రేక్షకుడిగా అన్ని కోణాల్లో ప్రభాస్‌ని చూపించాలనే పట్టుదలతో ఈ కథ తయారు చేశాను. అందుకని ఈ కథ చేయడానికి కొంచెం కష్టపడ్డాను. ఆ సెక్షన్ ఈ సెక్షన్ అని కాకుండా ఎవరెవరు ప్రభాస్‌ని ఏ విధంగా చూడాలనుకుంటారో ఈ చిత్రంలో ప్రభాస్ అలా ఉంటారు. ప్రభాస్ అంటే యూత్ ఐకాన్. పెద్ద హీరో అనే ఫీలింగ్‌తో కథ చెప్పడానికి వెళ్లాను. అదే ఫీలింగ్‌తోనే షూటింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీక్ షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్‌ని ఓ పెద్ద హీరోలా చూడటం మానేశాను. ఓ ఫ్రెండ్‌ని డెరైక్ట్ చేస్తున్నఫీలింగ్ అన్నారు.

  ఇక ప్రభాస్ డెరైక్టర్స్ ఆర్టిస్ట్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడో చోట ఎవరో ఒకరి మధ్య 'ఇగో' ప్రాబ్లమ్స్ రావడం సహజం. కానీ ఈ సినిమాకి అలాంటివేం జరగలేదు. దానికి కారణం సినిమాకి సంబంధించిన వ్యక్తులందరూ ఓ మంచి వాతావరణం క్రియేట్ చేయడమే. ఈ సినిమాకి పని చేయడం నాకు 'పెయిడ్ హాలిడే'లా అనిపించింది అని వివరించారు.

  నిర్మాతల గురించి చెపుతూ.. వాళ్లిద్దరూ నాకు మంచి స్నేహితులు. కానీ 'మిర్చి' సినిమా వాళ్లతో చేద్దామని నేను అనుకోలేదు. ఎందుకంటే, ఫస్ట్ సినిమా అంటే పెద్ద దర్శకుడితో చేయాలనుకుంటారు. అదే వాళ్లతో అంటే.. 'మేం కథకి ప్రాధాన్యం ఇస్తాం' అన్నారు వాళ్లు. ఆ ఒక్క మాటలో వాళ్ల అభిరుచి ఏంటో తెలిసింది. కథ విని, ఈ సినిమాని నిర్మించారు అన్నారు. 'మిర్చి' విడుదల దగ్గరపడుతోంది. టెన్షన్ కాదు కానీ ఎగ్జయిటింగ్‌గా, థ్రిల్‌గా ఉంది అని ముగించారు.

  English summary
  Mirchi is an upcoming Telugu film written and directed by debutante Koratala Siva. The film stars Prabhas, Anushka Shetty and Richa Gangopadhyay in the lead roles and Sathyaraj, Adithya and Nadhiya in pivotal roles. The film started its regular shooting on December 1, 2011 in Hyderabad. The film was tentatively titled Vaaradhi, but was later renamed to Mirchi. Mirchi release date is confirmed as February 8, 2013.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X