»   » వీరభద్ర స్వామికి పూజలు చేసిన కొరటాల శివ

వీరభద్ర స్వామికి పూజలు చేసిన కొరటాల శివ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బూర్గంపాడు: మహేష్ తో 'శ్రీమంతుడు' వంటి హిట్ ఇచ్చిన చిత్ర దర్శకుడు కొరటాల శివ. ఆయన ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతెగడ్డ దీవిలోని వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు.

కుటుంబసభ్యులతో కలసి భద్రాచలం పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం మోతెగడ్డ దీవికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇరవెండి పంచాయతీ ఉపసర్పంచ్‌ బికసాని శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కొరటాల శివ కెరీర్ విషయానకి వస్తే...

Koratala Shiva pray prayers to Lord Veera Badra Swamy

మిర్చి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత దర్శకుడు కొరటాల శివ కు చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే వరసగా ఆయన కథలు చెప్తూనే ఉన్నారు. అయితే ఎక్కడా ఓకే కాలేదు. రామ్ చరణ్ ,ఎన్టీఆర్, చిరంజీవి కోసం ఆయన కథలు వినిపించారు. అయితే ఏమీ వర్కవుట్ కాలేదు. ఈ లోగా ఆయన మహేష్ ని కలిసి కథ ఒప్పించుకుని శ్రీమంతుడుని తెరకెక్కించారు. అలాగే అందరి అంచనాలను తగ్గకుండా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నారు.

ఈ నేపధ్యంలో కొరటాల శివకు స్టార్ హీరోలంతా బొకేలు పంపి శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టుని కొరటాల శివ తో ఓకే చేసుకున్నారు ఎన్టీఆర్. శ్రీమంతుడు నిర్మించిన బ్యానర్ పైనే ఈ సినిమా రూపొందనుంది. ఆ తర్వాత రామ్ చరణ్ అంటున్నారు. ఇలా కాదన్న హీరోలు మళ్లీ వరస పెట్టడం విజయమే మరి.

''కథని నమ్మి చేసిన సినిమా 'శ్రీమంతుడు'. చిత్రబృందమంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే ఆ కష్టమంతా ఎగిరిపోతోంద''న్నారు కొరటాల శివ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు, శ్రుతి హాసన్‌ జంటగా నటించారు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించింది.

కొరటాల శివ మాట్లాడుతూ ''ఈ కథ ఒప్పుకొని, మమ్మల్ని ముందుండి నడిపించారు మహేష్‌. మాకంటే ఆయనే ఎక్కువ కథని నమ్మారు. ప్రేక్షకులకూ మా ప్రయత్నం నచ్చింది. తొలిరోజే 'సూపర్‌ హిట్‌' అనే ముద్ర వేసేశారు''అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యర్నేని మాట్లాడుతూ ''మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రమిది. తొలి రోజు నుంచే శ్రీమంతుడు పేరుకు తగ్గట్టే సిరులు కురిపిస్తున్నారు''అన్నారు.

English summary
Director koratala Siva pay prayers to Lord Veera Bhadra Swamy. Finally Koratala Siva scored another sensation with Mahesh Babu's ‘Srimanthudu’. Now all top stars are sending signals to Siva. NTR is ahead in the race and sources say, he already gave green signal.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu