For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆశ్యర్య పోయా...మహేష్ బాబుకు చెప్తా

  By Srikanya
  |

  బూర్గంపాడు: హీరో మహేష్‌బాబు అమ్మమ్మ స్వగ్రామం బూర్గంపాడు మండలం ముసలిమడుగు అని తెలుసుకున్నాక ఆశ్చర్యానికి లోనయ్యా. ఈ గ్రామాన్ని ఓ సారి సందర్శించాలని మహేష్‌బాబుకు చెబుతా' అని కొరటాల శివ అన్నారు.

  మహేష్ తో 'శ్రీమంతుడు' వంటి హిట్ ఇచ్చిన చిత్ర దర్శకుడు కొరటాల శివ. ఆయన ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతెగడ్డ దీవిలోని వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు.

  కుటుంబసభ్యులతో కలసి భద్రాచలం పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం మోతెగడ్డ దీవికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇరవెండి పంచాయతీ ఉపసర్పంచ్‌ బికసాని శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  Koratala Shiva request to Mahesh Babu about his Grand Mother Village

  అద్భుత నిర్మాన శైలిలో శతాబ్ధాల కిందటే నిర్మితమైన మోతెగడ్డ ఆలయం సరైన గుర్తింపునకు నోచుకోలేకపోయింది. కాగా, మొన్నటి గోదావరి పుష్కరాల సందర్భంలో మాత్రం అనూహ్య ఆదరణ పొందింది. రహదారి సౌకర్యాన్ని మెరుగుపర్చడంతో వీరభద్రస్వామి ఆలయంతోపాటు దానికి సమీపంలోని చంద్రశేఖరస్వామి ఆలయానికి కూడా భక్తులు, సెలబ్రిటీల రాక పెరుగుతున్నది. కొరటాల రాకతో మోతె ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఈ సందర్బంగా కలిసిన మీడియాతో కొరటాల శివ మాట్లాడారు. శ్రీమంతుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందని, రానున్న రోజుల్లో ఇలాంటి మెసేజ్‌తో కూడిన సినిమాలు మరిన్ని వచ్చే అవకాశాలున్నాయన్నారు దర్శకుడు కొరటాల శివ.

  Koratala Shiva request to Mahesh Babu about his Grand Mother Village

  అలాగే.. 'ప్రేక్షకులకు చక్కని ఆలోచన కలిగిస్తే తప్పకుండా అటువంటి సినిమాను ఆదరిస్తారు. ప్రతీ సినిమా శ్రీమంతుడులాగే ఉండాలని లేదు. దర్శకుడిగా శ్రీమంతుడు సినిమా మంచి సంతృప్తినిచ్చింది. కొత్త ప్రాజెక్టుకు చర్చలు ప్రారంభమయ్యాయి అన్నారు.

  కొరటాల శివ కెరీర్ విషయానకి వస్తే...

  మిర్చి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత దర్శకుడు కొరటాల శివ కు చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే వరసగా ఆయన కథలు చెప్తూనే ఉన్నారు. అయితే ఎక్కడా ఓకే కాలేదు. రామ్ చరణ్ ,ఎన్టీఆర్, చిరంజీవి కోసం ఆయన కథలు వినిపించారు. అయితే ఏమీ వర్కవుట్ కాలేదు. ఈ లోగా ఆయన మహేష్ ని కలిసి కథ ఒప్పించుకుని శ్రీమంతుడుని తెరకెక్కించారు. అలాగే అందరి అంచనాలను తగ్గకుండా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నారు.

  ఈ నేపధ్యంలో కొరటాల శివకు స్టార్ హీరోలంతా బొకేలు పంపి శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టుని కొరటాల శివ తో ఓకే చేసుకున్నారు ఎన్టీఆర్. శ్రీమంతుడు నిర్మించిన బ్యానర్ పైనే ఈ సినిమా రూపొందనుంది. ఆ తర్వాత రామ్ చరణ్ అంటున్నారు. ఇలా కాదన్న హీరోలు మళ్లీ వరస పెట్టడం విజయమే మరి.

  ''కథని నమ్మి చేసిన సినిమా 'శ్రీమంతుడు'. చిత్రబృందమంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే ఆ కష్టమంతా ఎగిరిపోతోంద''న్నారు కొరటాల శివ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు, శ్రుతి హాసన్‌ జంటగా నటించారు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించింది.

  కొరటాల శివ మాట్లాడుతూ ''ఈ కథ ఒప్పుకొని, మమ్మల్ని ముందుండి నడిపించారు మహేష్‌. మాకంటే ఆయనే ఎక్కువ కథని నమ్మారు. ప్రేక్షకులకూ మా ప్రయత్నం నచ్చింది. తొలిరోజే 'సూపర్‌ హిట్‌' అనే ముద్ర వేసేశారు''అన్నారు.

  నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ యర్నేని మాట్లాడుతూ ''మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రమిది. తొలి రోజు నుంచే శ్రీమంతుడు పేరుకు తగ్గట్టే సిరులు కురిపిస్తున్నారు''అన్నారు.

  English summary
  Director koratala Siva pay prayers to Lord Veera Bhadra Swamy. Finally Koratala Siva scored another sensation with Mahesh Babu's ‘Srimanthudu’. Now all top stars are sending signals to Siva. NTR is ahead in the race and sources say, he already gave green signal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X