twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'భరత్ అనే నేను' కథ వెనుక మరో కథ.. బయట పెట్టిన కొరటాల!

    |

    Recommended Video

    Barath Ane Nenu Director Clarifies About Gossips

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఈ శుక్రవారం ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న భరత్ అనే నేను చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. మహేష్ ధాటికి టాలీవడ్ రికార్డులు గల్లంతు కావడం ఖాయం అని అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగ స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. మహేష్ బాబు నటిస్తున్న తొలి పొలిటికల్ డ్రామా ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాజకీయ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్ర కథ వెనుక మరో కథ ఉంది. ఆవిషయం గురించి దర్శకుడు కొరటాల క్లారిటీ ఇచ్చారు.

    రికార్డుల వేటకోసం

    రికార్డుల వేటకోసం

    భరత్ అనే నేను చిత్రం సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై సినీవర్గాలు, అభిమానులు పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. పక్కా బ్లాక్ బాస్టర్ అని మహేష్ ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    సూపర్ హిట్ కాంబినేషన్

    సూపర్ హిట్ కాంబినేషన్

    ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ చిత్ర విజయాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఆయన చేసిన మూడు చిత్రాలు మిర్చి, శ్రీమంతుడు,జనతా గ్యారేజ్ చిత్రాలు తిరుగులేని విజయాలు సాధించాయి. మహేష్, కొరటాల సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్నా చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకే విధంగా ఉన్నాయి.

    పొలిటికల్ డ్రామా

    పొలిటికల్ డ్రామా

    మహేష్ బాబు నటిస్తున్న తొలి రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం ఇదే. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో దర్శకుడు కొరటాల శివ సమాజంలో ఉన్న ప్రధాన సమస్యలని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

    భరత్ అనే నేను కథ వెనుక

    భరత్ అనే నేను కథ వెనుక

    భరత్ అనే నేను చిత్ర కథ వెనుక ఓ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్ర కథని కొరటాల శివ పెద్ద మొత్తం చెల్లించి తకిట తకిట దర్శకుడు శ్రీహరి నుంచి తీసుకున్నారని వార్తలు వచ్చాయి.

    కొరటాల క్లారిటీ

    కొరటాల క్లారిటీ

    ఈ వార్తల విషయంలో దర్శకుడు కొరటాల క్లారిటీ ఇచ్చారు. శ్రీహరి తన స్నేహితుడు అని, తామిద్దరం రూంలో ఉన్న సమయంలో ఓ స్టోరీ లైన్ చెప్పాడని, దానిని తాను డెవలప్ చేసి భరత్ అనే నేను చిత్ర కథగా మార్చానని కొరటాల తెలిపాడు. స్టోరీలైన్ ఇచ్చినందుకు సినిమా టైటిల్స్ లో శ్రీహరి పేరు కూడా వేస్తున్నాం అని కొరటాల అన్నారు.

    English summary
    Koratala Siva gives clarity on Bharat Ane Nenu story. Bharat Ane Nenu releasing on April 20
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X