For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  "తాగుబోతు" అన్న ముద్ర అలా వచ్చింది: కోటా శ్రీనివాసరావు

  |

  సినీ ఇండస్ట్రీ లో గాసిప్ లు తక్కువేం కాదు అధికంగా కొన్ని రూమర్లకి బలైపోయేవాళ్ళు సాధారణం గా సినిమా సెలబ్రిటీల మీద వచ్చే రూమర్లు ఎలా ఉంటాయో చెప్తూ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు తన జీవితం లోని సంఘటననే ఉదహరిస్తూ ఇలా చెప్పుకొచారు. ఈ మధ్య ఒక పత్రికలో కోటా జీవిత విశేషాలతో వస్తోన్న ఒక శీర్షికలో ఇండస్ట్రీ లో తాను వీర తాగుబోతుగా ఎలా ముద్ర పడిపోయాడో చెప్పారు కోటా... ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

  కొన్ని అల‌వాట్లు సినిమా వారికి స‌హ‌జం.

  కొన్ని అల‌వాట్లు సినిమా వారికి స‌హ‌జం.

  చేసే వృత్తి వ‌ల్ల‌నో, ఇంటికి దూరంగా ఉండాల్సి రావ‌డం వ‌ల్లనో, ఇంకోటో, మ‌రోటో.. ఏదైనా కొన్ని అల‌వాట్లు సినిమా వారికి అల‌వ‌డ‌టం కాస్త స‌హ‌జం. అలా నాకు కూడా ఒక అల‌వాటు అల‌వాటైంది. నేను బూమ్‌లో ఉండి రోజుకి నాలుగు షిఫ్ట్లు, మూడు షిఫ్టులు చేసేవాణ్ణి.

  ఈ కష్టాలు తప్పేవి కావు

  ఈ కష్టాలు తప్పేవి కావు

  అప్పట్లో ఇప్పుడున్నని సౌకర్యాలు ఉండేవి కాదు స్పాట్లో నే ఏ చెట్లకిందో, ఏదో ఒక పక్కన మేకప్ వేసుకోవాల్సి వచ్చేది. పెద్ద హీరోల సినిమాలంటే ఎక్కువగా సెట్స్ లోనే జరిగేవి, కానీ చిన్న సినిమాల్లో జరిగినప్పుడు మాత్రం బయట ఈ కష్టాలు తప్పేవి కావు. అప్ప‌ట్లో వినోదానికి కూడా పెద్ద‌గా ఏమీ ఉండేవి కావు. స్నేహితులు ఎవ‌రైనా ఉంటారా అంటే ఉండ‌రు.

  భార్య గుర్తుకొచ్చేది

  భార్య గుర్తుకొచ్చేది

  బ‌జారులో తిరుగుదామా అంటే జ‌నాలు మీద‌ప‌డిపోయేవారు. అందువ‌ల్ల ఎక్కువ‌గా రూముల్లోనే ఉండాల్సి వ‌చ్చేది. పైగా న‌డి వ‌య‌స్కుణ్ణి. ఆ వ‌య‌సులో జీవితంలో శారీర‌క‌మైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. సాయంత్రం అయ్యేస‌రికి పిల్ల‌లు గుర్తొచ్చేవారు. భార్య గుర్తుకొచ్చేది.

  నిద్ర‌ప‌ట్టేది కాదు

  నిద్ర‌ప‌ట్టేది కాదు

  పిల్ల‌లు ఏం చ‌దువుతున్నారు? ఏంటి? ఎలా ఉన్నారు? వ‌ంటివి తెలిసేది కాదు. ఆ ఆలోచ‌న‌ల‌తో నిద్ర‌ప‌ట్టేది కాదు. అలాంటి స‌మ‌యంలో నాకు మ‌ద్యం అల‌వాటైంది. రెండు పెగ్గులు తాగితే నిద్ర‌ప‌డుతుంద‌ని ఒకాయ‌న అన్నారు. దాంతో మొద‌లుపెట్టా. రోజూ షూటింగ్ నుంచి వ‌చ్చాక రెండు పెగ్గులు తాగేవాణ్ణి.

  జీవితం చాలా బిజీ అయిపోయింది

  జీవితం చాలా బిజీ అయిపోయింది

  రెండు మెతుకులు తిని ప‌డుకునేవాణ్ణి. రానురాను జీవితం చాలా బిజీ అయిపోయింది. రోజుకు మూడు షిఫ్టులు కూడా చేసేవాణ్ణి. షూటింగ్ పూర్తి చేసుకుని రాత్రి రూమ్‌కి వెళ్లేపాటికి ఒక‌టిన్న‌ర‌, రెండు అయ్యేది. రాత్రి ఎనిమిది గంట‌ల‌కు బోయ్ రూమ్‌లో క్యారీర్ పెట్టేవాడు.

  పెరుగ‌న్నం మాత్రం తినే వాణ్ణి

  పెరుగ‌న్నం మాత్రం తినే వాణ్ణి

  చ‌ల్ల‌గా అయిపోయేది. రాత్రి రెండు గంట‌ల‌కు రూమ్‌కు వెళ్లి స్నానం చేసి తిందామంటే న‌చ్చేదికాదు. అప్పుడు రెండు, మూడు పెగ్గులు తాగేవాణ్ణి. మిగిలిన కూర‌ల జోలికి వెళ్ల‌కుండా పెరుగ‌న్నం మాత్రం తినే వాణ్ణి. అది కూడా పులిసిపోయి నుర‌గ‌లు క‌క్కుతూ ఉండేది. అయినా రెండు, మూడు ముద్ద‌లు అలాగే తిని ప‌డుకునేవాణ్ణి.

  వాస‌న‌కొట్టేది

  వాస‌న‌కొట్టేది

  క‌డుపులోకి వెళ్లింది పేగుల్లో ఒక రౌండ్ కూడా తిరిగేది కాదు. తెల్లారుజామునే బోయ్ వ‌చ్చి రూమ్ బెల్ కొట్టి ‘గుడ్ మార్నింగ్ సార్‌' అనేవాడు. ‘ఆ గుడ్‌.. మార్నింగ్' అనగానే వాస‌న‌కొట్టేది. దానికి తోడు క‌ళ్ళు ఉబ్బి క‌నిపించేవి. ఇలాగ ఉండేది ప‌రిస్థితి. ఇంతుంటే అంత చెప్పుకునేవారు.

  తెల్లార్లు తాగుతాడ్రా నాయ‌నా

  తెల్లార్లు తాగుతాడ్రా నాయ‌నా

  ‘కోట‌గాడు తెల్లార్లు తాగుతాడ్రా నాయ‌నా... వాస‌నేసేస్తోంది పొద్దున్నే' అనే మాట స‌ర్వ‌త్రా వినిపించేది. ‘బాగా తాగుతాడు కోట శ్రీనివాస‌రావు' అనేది ఇండ‌స్ట్రీలో అంద‌రి నోటా వినిపించేది. అలా అలా నేను అందరి దృష్టిలో తాగుబోతునయ్యాను. అంటూ తన జీవితం లోకి ఈ అలవాటూ, బయట ఆపేరు వచ్చిన తీరునీ చెప్పారు...

  English summary
  Tollywood Senior actor Kota Srinivasarao Opens up about his Drinking Habit
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X