»   » ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేను..పోటీ చేయను

ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేను..పోటీ చేయను

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kota srinivasa rao says not interested in Politics
హైదరాబాద్ : ప్రస్తుత రాజకీయాల్లో నేను ఇమడలేను. అంతా రూ.కోట్ల మీద వ్యవహారమైపోయింది. పైగా వయసు కూడా సహకరించడంలేదు. అందుకే పోటీ చేయకూడదనుకుంటున్నా. అయితే భాజపా తరుపున ప్రచారం మాత్రం చేస్తా అంటూ తేల్చి చెప్పారు ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు. 'ఎమ్మెల్యే భరత్‌' సినిమా షూటింగ్ సమయంలో కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

కోట శ్రీనివాస రావు మాట్లాడుతూ.... ప్రస్తుతం రేసుగుర్రం, లడ్డూ బాబూ, జంప్‌ జిలానీలతో పాటు తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నా. దాదాపు 800 చిత్రాల్లో నటించా. తోటి దగ్గర్నుంచి దుర్యోధనుడి వరకూ అన్ని రకాల పాత్రలనూ పోషించా. ప్రస్తుతం వస్తున్న కథలకు అనుగుణంగా నటించడం తప్ప ఇతరత్రా కలలేమీ లేవు అన్నారు.

అలాగే ఇప్పుడొస్తున్న చిత్రాల గురించి చెప్తూ... గతంలో సినిమాల ప్రభావం సమాజంపై ఉండేది. ఇప్పుడు సమాజం సినిమాపై ప్రభావం చూపుతోంది. కథలు, వాటి గమనం పూర్తిగా మారిపోయాయి. సంసార పక్షంగా ఉండే చిత్రాలనేవే కనిపించడం లేదు. మన దగ్గర ప్రతిభ ఉంది. కనుక దానిని ప్రోత్సహించమనే చెప్తుంటా. మన దగ్గర అసలు నటులే లేరన్నట్టు పరభాషా నటుల వెంట పడడం నాకు నచ్చదు. అలాగని అద్వితీయ ప్రతిభ ఉన్న పరభాషా నటులను తీసుకోవడం తప్పేమీకాదు అని చెప్పారు.

తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ ''రవీంద్రభారతిలో నా నాటకం చూసిన దర్శకుడు సీఎస్ రావు గారు క్రాంతికుమార్‌గారికి నన్ను పరిచయం చేశారు. ఆయన 'ప్రాణం ఖరీదు'(1978)తో నాకు తొలి అవకాశం ఇచ్చారు. బ్యాంక్ ఉద్యోగినైన నేను ఆ తర్వాత అయిదారేళ్ల పాటు సినిమాల్లో నటించలేకపోయాను. కొన్నాళ్ల తర్వాత పీఎల్ నారాయణగారి 'కుక్క' చిత్రంలో విలన్‌గా చేశాను. తర్వాత జంధ్యాల అమరజీవి, బాబాయ్ అబ్బాయ్ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాను. నాటక కళాకారుడ్ని కావడంతో టి.కృష్ణగారు 'వందేమాతరం' సినిమాలో ఓ మంచి పాత్ర ఇచ్చారు. తర్వాత ఆయనే 'ప్రతిఘటన'లో మంత్రి పాత్ర నాతో చేయించారు. ఇక అప్పట్నుంచీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది'' అన్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా‌, హాస్య నటుడిగా, విలన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను మైమరిపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. బ్యాంకు ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టి 'ప్రతిధ్వని' సినిమాతో వెండితెరపై స్థిరపడిపోయారు. దాదాపు 30 సంవత్సరాలుగా తన నటనతో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్న ఆయన రాజకీయంగానూ సత్తా చాటారు. విజయవాడ నుంచి ఒక పర్యాయం భాజపా తరుపున శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

English summary
Kota Srinivasa Rao can be called as king of expressions. He can exhibit all the navarasas in eyes without uttering a single word and made name for himself in Tollywood before casting his spell across entire Indian film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu