»   » మహేష్ సిక్స్ ప్యాక్ గురించి ట్రైనర్...

మహేష్ సిక్స్ ప్యాక్ గురించి ట్రైనర్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : '1' చిత్రం లో సిక్స్ ప్యాక్ తో కనపడటం కోసం మహేష్ బాబు ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ ఆధ్వర్యంలో తన బాడీ షేప్స్ మార్చుకున్న సంగతి తెలిసిందే. క్రిస్ గెతిన్ ..హృతిక్ రోషన్, జాన్ అబ్రహం కు ఫిట్ నెస్ ట్రైనర్. అయితే వారిద్దరి కన్నా మహేష్ బాగా త్వరగా షేప్ అప్ అయ్యారని క్రిస్ చెప్తున్నారు.

క్రిస్ గెతిన్ మాట్లాడుతూ.. నేను నా ట్రైనింగ్ లో భాగంగా ..గత మూడు నెలలుగా డ్రమటిక్ ట్రాన్సర్మేషన్ ప్రిన్సపల్ ని మహేష్ పై అప్లై చేస్తున్నాను. అవి చేతి కండరాలు, ఛాతీ ని పెంచటానికి పనిచేసి,మనం కోరుకున్న లుక్ ని తీసుకువస్తాయి. నేను మహేష్ కు ముఖ్యంగా డైట్ విషయంలోనే సలహా ఇచ్చాను. అతని లైఫ్ స్టైల్ కి, బాడీ టైపు కు,బ్లడ్ టైప్ కు ఏ ఆహారం సూట్ అవుతుందో అదే ఎంపిక చేసి..ఈ పోగ్రామ్ మొదలు పెట్టాను.

అయినే నా మెయిన్ ఫోకస్ మాత్రం డైట్ మీదే. నేను ఎప్పుడూ ఒకటే చెప్తూంటాను.. కండరాలు ఎప్పుడూ జిమ్ లో పెరగవు...కిచెన్ లోనే వస్తాయి. మనం తీసుకునే ఆహారానికి సమతౌల్యం గా ఎక్సరసైజ్ ఉండాలి. క్రిస్ గెతిన్ చెప్పిన వివరాల ప్రకారం రోజుకు 7 సార్లు పౌష్టికారం తీసుకునే వాడట మహేష్ బాబు. అందులో చికెన్, ఫిష్, బచ్చలి కూర, ఓట్స్, పాస్తా, బ్రాకోలి లాంటి అధిక పోషక విలువలున్న పదార్థాలు ఉండేవట. షూటింగ్ సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో మాగ్జిమం కొద్ది పాటి టిప్స్ తో మనం కోరుకున్న ఆకారం రప్పించవచ్చు అంటున్నారు. అంతేకాదు...మహేష్ కు ఫేస్ లో ఆ లుక్ ,గ్లో పోకుండా...అతని బాడీని సెట్ చేసే పనిలో ఉన్నానని చెప్తున్నారు.

ఇక '1' చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనమ్ హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నార్తన్ ఐర్లాండ్, లండన్, యు.కె.లో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన కీలకమైన భాగం ఇక్కడే చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Talking about Mahesh's routine, Gethin, who also boasts of training Hrithik Roshan and John Abraham, says, "I placed Mahesh on a diet, suitable to his body type, blood type and lifestyle. I put him through cross fit and plyometrics as part of his daily cardio regime and applied my DTP program to his routine. But the central focus was mainly on his diet. I always say you get your abs in the kitchen, not in the gym."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu