twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ కొత్త కథ చిరుకోసమా చరణ్ కోసమా..?? ఇంకా వీడని అనుమానాలు

    గౌతమీ పుత్ర.. ఆడియో ఫక్షన్ లో క్రిష్ "కబర్దార్" కామెంట్ కాంట్రవర్సీ ఇంకా చిరు అభిమానులు మర్చిపోలేదు. కానీ ఇప్పుడు క్రిష్ సినిమా చిరు తోనే అనగానే అంతా ఆసక్తి గా చూసారు.

    |

    మెగాస్టార్, క్రిష్ ఈ ఇద్దరి కాంబో ఎలా ఉంటుందీ..? మరిప్పుడు క్రిష్ చిరు కాంబినేషన్ అంటే ఎలాఉంటుందన్న విషయం ఆసక్తిగానే ఉంటుంది కదా.... మొన్నటికి మొన్న గౌతమీ పుత్ర ఆడియో ఫక్షన్ లో క్రిష్ "కబర్దార్" కామెంట్ కాంట్రవర్సీ ఇంకా చిరు అభిమానులు మర్చిపోలేదు. కానీ ఇప్పుదు క్రిష్ సినిమా చిరు తోనే అనగానే అంతా ఆసక్తి గా చూసారు. అయితే అసలు ఆకథేమిటీ? ఆ కథ చిరు కోసమా లేదంటే క్రిష్ కి మంచి ఫ్రెండ్ అయిన చరణ్ కోసమా అన్న అనుమానం పై ఇంకా క్లారిటీ రాలేదు ఆ వివరాలు

    మంచి విజయాలనే సాధించినా

    మంచి విజయాలనే సాధించినా

    మంచి విజయాలనే సాధించినా ఆర్ట్ లుక్ ఉండే సినిమాలు కావటం తో అగ్రహీరోలు క్రిష్ సినిమా అంటే కొంత ఆలోచించారు, గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ , కంచె... ఇలా ఏ సినిమా చూసినా అక్కడ కథే హీరో. కథ కోసం హీరో ఉంటాడు తప్ప హీరో కోసమే కథ తయారు చేయటం అంటూ ఉండదు.

    అమాంతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ స్థాయికి తీసుకువెళ్ళి కూచోబెట్టింది.

    అమాంతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ స్థాయికి తీసుకువెళ్ళి కూచోబెట్టింది.

    అందుకే ప్రతీసారీ తన సినిమాతో మంచి విజయాన్నే అందుకున్నా కమర్షియల్ ఫార్ములా కాదేమో అన్న అనుమానం ఉండేది..కానీ క్రిష్ కి తన సినిమా హిట్ అయ్యే మార్గం ఏమిటో ఖచ్చితమైన క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైతే కంచె అనే సినిమా తీసాడో క్రిష్ లో ఉండే మార్కెటింగ్ సత్తా అర్థమయ్యింది ఆవెంటనే కొత్తాపాతా, లాభాలు తెస్తాడాలేదా అని ఆలోచించకుందా దర్శకున్ని మాత్రమే చూసే బాలయ్య తో కలవటం క్రిష్ ని అమాంతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ స్థాయికి తీసుకువెళ్ళి కూచోబెట్టింది.

    ఇదివరకు క్రిష్ తో సినిమా అంటే కాస్త సందేహించిన పెద్ద హీరోలు..

    ఇదివరకు క్రిష్ తో సినిమా అంటే కాస్త సందేహించిన పెద్ద హీరోలు..

    అంతే ఇదివరకు క్రిష్ తో సినిమా అంటే కాస్త సందేహించిన పెద్ద హీరోలు.. ఇప్పుడు అతడితో సినిమాకు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ‘శాతకర్ణి' తర్వాత విక్టరీ వెంకటేష్ క్రిష్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు క్రిష్, ఐతే వెంకీ కోసం అనుకున్న కథ.. ఒక నవల నుంచి తీసుకున్నది.

    డాక్టర్. కేశవరెడ్ది గారి నవల

    డాక్టర్. కేశవరెడ్ది గారి నవల "అతడు అడవైని జయించాడు

    డాక్టర్. కేశవరెడ్ది గారి నవల "అతడు అడవైని జయించాడు" ఆధారంగా రసుకోవాలనుకున్న కథ. కానీ ఆ నవల హక్కులు దక్కించుకోలేకపోవడంతో ఈ సినిమా ముందుకు కదల్లేదు.అయితే... స‌రిగ్గా అదే స‌మ‌యంలో దూలం స‌త్య‌నారాయ‌ణ అనే ఓ ఔత్సాహిక యువ‌కుడు అత‌డు అడ‌విని జ‌యించాడు పుస్త‌కం రైట్స్ తీసేసుకున్నాడు . అందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

    ఆ పుస్తకంలోని పాయింట్ మాత్ర‌మే తీసుకొన్నా స‌రే.

    ఆ పుస్తకంలోని పాయింట్ మాత్ర‌మే తీసుకొన్నా స‌రే.

    ఆ పుస్తకంలోని పాయింట్ మాత్ర‌మే తీసుకొన్నా స‌రే.. మొత్తం రైట్స్‌ని కొనుకోలు చేయాల‌ని క్రిష్ భావించాడు. అత‌ని కంటే ముందు దూలం స‌త్య‌నారాయ‌ణ ఆ రైట్స్‌ని సొంతం చేసుకోవ‌డంతో.. క్రిష్ - వెంకీల సినిమా ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింది. ఐతే ఇప్పుడు స్వయంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేసే ప్రయత్నాల్లో క్రిష్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

    మీలో ఎవరు కోటీశ్వరుడు షో షూటింగ్ సమయంలో

    మీలో ఎవరు కోటీశ్వరుడు షో షూటింగ్ సమయంలో

    మీలో ఎవరు కోటీశ్వరుడు షో షూటింగ్ సమయంలో క్రిష్ వెళ్ళి చిరంజీవి కి కథ వినిపించడం జరిగిందట. ఆ కథకు చిరు కొన్ని మార్పులు, చేర్పులు చెప్పినట్లు తెలుస్తోంది. క్రిష్ ఇప్పుడు ఆ కథను పూర్తి చేసే పనిలో పడ్డాడట. అయితే ఇంకో వాదన కూడా వినిపించింది.

    క్రిష్ కథ చెప్పటానికి వెళ్ళింది చిరు కోసం కాదని చరణ్ కోసమని

    క్రిష్ కథ చెప్పటానికి వెళ్ళింది చిరు కోసం కాదని చరణ్ కోసమని

    క్రిష్ కథ చెప్పటానికి వెళ్ళింది చిరు కోసం కాదని చరణ్ కోసమని కూడా చెప్పుకున్నారు. క్రిష్‌తో పని చేయడానికి చరణ్ కూడా ఆసక్తి చూపించాడు. దీంతో క్రిష్ చెప్పిన కథ చరణ్ కోసమే అన్న ప్రచారం మొదలైంది. ఐతే క్రిష్ మాత్రం చిరంజీవితోనే సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

    క్రిష్ కథకు చిరు ఓకే చెప్పాడా లేదా అన్నది తెలియదు

    క్రిష్ కథకు చిరు ఓకే చెప్పాడా లేదా అన్నది తెలియదు

    ఐతే క్రిష్ కథకు చిరు ఓకే చెప్పాడా లేదా అన్నది తెలియదు. చిరు ఓకే అనాలే కానీ.. ఎలాంటి సినిమా అయినా ఆరు నెలల్లో పూర్తి చేసి విడుదలకు సిద్ధ చేసేస్తాడు క్రిష్. ‘శాతకర్ణి' విషయంలో క్రిష్ స్పీడేంటో అందరూ చూశారు కదా. కాకపోతే ఇప్పటికిప్పుడే ఈ ప్రాజెక్ట్ మొదలు కాకపోవచ్చు దీనికంటే ముందు చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని పూర్తి చేయాల్సి ఉంది.

    English summary
    Recently director Krish has met Chiranjeevi and congratulated for his Khaidi No. 150 success while he took blessings for Gautamiputra Satakarni success.But the question is, did Krish narrated this story for Chiranjeevi or for movie with Charan?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X