»   » మెగా హీరోలను ఉద్దేశించి నేను ‘ఖబడ్దార్‌’ అని హెచ్చరించలేదు

మెగా హీరోలను ఉద్దేశించి నేను ‘ఖబడ్దార్‌’ అని హెచ్చరించలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రెండు రోజుల క్రితం వైభవంగా బాలయ్య వందో చిత్రం 'గౌతమిపుత్రశాతకర్ణి' ఆడియో వేడుక జరగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మాట్లాడిన దర్శకుడు క్రిష్‌ తన ప్రసంగం చివర్లో 'ఖబడ్దార్‌' అని హెచ్చరించడం వివాదాస్పదంగా మారింది.

సంక్రాంతి బరిలో తమ సినిమాతో పోటీ పడుతున్న 'ఖైదీ నెంబర్‌ 150'ని ఉద్దేశించే క్రిష్‌ అలా అన్నాడని పలు ఛానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ఇది పెద్ద వివాస్పదమయ్యే సూచనలున్న నేపథ్యంలో క్రిష్‌ ఆ వ్యాఖ్యపై స్పందించాడు.

'నేను అన్న 'ఖబడ్దార్‌' అనే పదానికి కొత్త అర్థాలను వెతకొద్దు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి తరపున నేను ఆ మాట అన్నాను. మన సంస్కృతికి, సంప్రదాయాలకు సరైన గౌరవం దక్కడం లేదనే తెలుగు ప్రజల బాధనే నేను వ్యక్తం చేశాను. నేను 'ఖబడ్దార్‌' అని హెచ్చరించింది తెలుగు వారిని గౌరవించని, దేశాన్ని, ప్రపంచాన్ని. అంతే తప్ప వ్యక్తులను కాదు' అని క్రిష్‌ వివరించాడు.

Krish Responds On 'Khabardar' Comment

తాను మెగా హీరోలను ఉద్దేశించే ఆ మాట అన్నానని వార్తలు ప్రసారం చేస్తున్నారని, కానీ తనకు వారితో మంచి అనుబంధముందని తెలిపాడు. 'నా రెండో సినిమాయే బన్నీ (వేదం)తో చేశాను. నాలుగో సినిమా 'కంచె' వరుణ్‌తేజ్‌తో చేశాను.

నేను సినీ పరిశ్రమలోకి ఎంటర్‌ అవకముందు నుంచే చరణ్‌ నాకు మంచి ఫ్రెండ్‌. ఇక, నేను సినిమాల్లోకి ఎంటర్‌ కావడానికి చిరంజీవిగారు స్ఫూర్తి. ఇలాంటి దురుద్దేశాలు ఆపాదించి తనకు, మెగా ఫ్యామిలీకి మధ్య కంచె నిర్మించొద్దు'అని క్రిష్‌ విజ్ఞప్తి చేశాడు.

English summary
“I request all dear friends who spread my words faultily. I uttered the word with pure anguish for not giving place for Telugu nativity in the history. I’m telling this heartfully. I used the word ‘Khabardar’ for sense of levity on Telugus who lived as Madrasis for ages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu