»   »  ఇదీ నానీ మాస్ యాంగిల్.. (వీడియో)

ఇదీ నానీ మాస్ యాంగిల్.. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' . ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా సాగింది. మీరు ఇక్కడ ఆ ట్రైలర్ ని చూడవచ్చు.


విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై సీడిని విడుదల చేశారు. 14 రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. అందాల రాక్షసి ఫేం హనురాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెహర్‌ కథానాయిక. చిత్ర బృందంతో అల్లరి నరేష్‌, సుకుమార్‌ తదితరులు హాజరయ్యారు.


Krishna Gadi Veera Prema Gaadha Theatrical Trailer

నాని ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. గతంలో ఈ సినిమాకు ‘జై బాలయ్య' అనే టైటిల్‌ వినిపించింది. అయితే ఈ టైటిల్ ఒక వర్గానికి చెందినదిగా ఉండటంతో 'కిృష్ణా గాడి వీర ప్రేమ గాథ' గా మార్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.


ఈ సినిమాకు గానూ...నాని తన రెమ్యూనరేషన్ 4 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు చెప్పుకంటున్నారు సమాచారం. నిజమైతే...ఇదే ప్రస్తుతానికి నాని కెరీర్ లో ది బెస్ట్ రెమ్యూనరేషన్ అవుతుంది .


ఈ సినిమా రోమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా రూపోందుతోంది. 14 రీల్స్ పతాకంపై రూపొందుతోందుతున్న ఈ సినిమాకు అనిల్ సుంకర్ నిర్మాత. అనంతపుతం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ ఇది. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.


నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ ప్రతాప్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.


English summary
Krishnagaadi Veera Prema Gaadha Theatrical Trailer released. Krishnagaadi Veera Prema Gaadha telugu movie stars Nani, Mehr Pirzada, Brahmaji, Sampath Raj, Harish Uthaman, Murli Sharma, Sathru, Pruthvi, Prabhas Srinu, Venu Tillu among others. Directed by Hanu Raghavapudi. Produced by Raam Achanta, Gopi Achanta, Anil Sunkara under the banner 14 Reels. Music scored by Vishal Chandrashekhar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu