For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిర్మాత మోసం, రమ్యకృష్ణతో విడాకుల మ్యాటర్,పవన్ తో కష్టం...: కృష్ణవంశీ

  By Srikanya
  |

  హైదరాబాద్: కృష్ణవంశీ సినిమాలు ముక్కు సూటిగా ఉంటాయి. మన చుట్టూ ఉండే అనేక అంశాలు డిస్కస్ చేస్తాయి. మన సమజాన్ని విశ్లేషణ చేస్తూంటాయి. మనలో ఉన్న మరో ఒకడిని ప్రశ్నిస్తూంటాయి. ఆయన ఆలోచనలు కేవలం సినిమాలకే పరిమితమా..నిజం జీవితంలోనూ అలాగే ఉంటారా...

  కృష్ణవంశీని డైరక్ట్ గా డైరక్టర్ గా పరిచయం ఉన్న వాళ్లు నిజ జీవితంలో కూడా ఆయన తన సినిమాల్లో ఏదైతే చెప్తారో, డిస్కస్ చేస్తారో అదే భావజాలం కలిగి ఉంటారంటారు. లోపల ఒకటి బయిటకు ఒకటి అన్నట్లు బిహేవ్ చేయరని చెప్తూంటారు. అలాంటి క్రియేటివ్ దర్శకుడు తెలుగు లీడింగ్ దినపత్రిక సాక్షిగా మాట్లాడారు.

  ఆయన మీడియా ముఖంగా ఇంటర్వూగా ఇచ్చిన అంశాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అనేక అంశాలను ఆయన మనస్సలో ఏమీ ఉంచుకోకుండా, ఎవరో ఏదో అనుకుంటారని భావించకుండా చెప్పేసారు. వాటిలో కొన్ని మీ ముందు ఉంచుతున్నాం. ముఖ్యంగా రమ్యకృష్ణతో ఆయన ఫ్యామిలీ లైప్, ఆయన్ని మోసం చేసిన నిర్మాతలు వంటివి...

  స్లైడ్ షోలో కృష్ణ వంశీ మాటలు యధాతథంగా...

  మోసం చేసారు..

  మోసం చేసారు..

  కొందరు నిర్మాతలు నన్ను మోసం చేశారు. వాళ్లకు డబ్బులొచ్చినా రాలేద ని నా దగ్గర్నుంచి తీసుకున్నారు. ఒకడు తన నాలుగైదేళ్ల కూతురు మీద ఒట్టేసి సినిమా చేయించుకున్నాడు. అయిపోయిన తర్వాత 4 కోట్లకు టెండర్ పెట్టాడు.

  అంబాని కాలేదు..రోడ్డుపై నేను పడలేదు

  అంబాని కాలేదు..రోడ్డుపై నేను పడలేదు

  ఆ నిర్మాత నాలుగు కోట్ల కోసం అబద్ధమాడుతున్నాడు, మోసం చేస్తున్నాడని తెలుసు. కానీ, నా సెంటిమెంట్‌కి కమిట్ అయ్యాను. నేను రోడ్డు మీద పడలేదు. వాడు బాగుపడి అంబానీ అవ్వలేదు. నాలుగు కోట్ల కోసం కక్కుర్తి పడ్డాడు. సరిగ్గా ఉండుంటే ఇంకో మంచి సినిమా చేసేవాణ్ణి. జన్మలో ఇక వాడితో సినిమా చేయను అన్నారు కృష్ణవంశీ.

  నాకు సూట్ కానివాళ్లతోనూ చేసాను

  నాకు సూట్ కానివాళ్లతోనూ చేసాను

  నాకు స్టార్ అయినా నాన్-స్టార్ అయినా ఒకటే. కథకు సూటయ్యేవాళ్లతోనే తీశాను. పేర్లెందుకు కాని కథకు సూట్ కాని వాళ్లతోనూ చేశాను. కానీ, అది చేస్తున్నప్పుడు 'మనకిది కరెక్ట్ కాదు' అనిపించింది.

  చరణ్ తో...

  చరణ్ తో...

  నేను రామ్‌చరణ్‌తో చేస్తే పెద్ద డెరైక్టర్ అన్నట్లా? సందీప్‌తో సినిమా చేస్తే చిన్న డెరైక్టర్ అన్నట్లా? నేను పడ్డానా? పెరిగానా? తగ్గానా? అని తెలియడంలేదు. నా వరకు నేను ప్రొఫెషనల్‌గా సక్సెస్ కావడం అంటే 'చందమామ', 'నక్షత్రం' లాంటి సినిమాలు తీయగలగడం. 60 కోట్లతోనూ సినిమా తీయగలను. 15 కోట్లతోనూ తీస్తాను.

  డేంజర్ తీసా..

  డేంజర్ తీసా..

  85 లక్షల్లో 'డేంజర్' చేశాను. నాకు సినిమా ఇంపార్టెంట్. దానికి పెట్టే పెట్టుబడి, వచ్చే బజ్ నాకు ముఖ్యం కాదు.ఏది పడితే అది కాకుండా ఎలాంటి సినిమా తీస్తున్నామనే విషయంలో దర్శకుడికి సామాజిక బాధ్యత ఉండాలి కదా? కచ్చితంగా.

  రాఖిలో మాత్రమే..

  రాఖిలో మాత్రమే..

  నా హీరో రౌడీయో, పోరంబోకో, సిస్టమ్‌ని లెక్క చేయనివాడో, జేబుదొంగో, హంతకుడో ఉండడు. నా 20 సినిమాల్లో ఒక్క 'రాఖీ' సినిమాలోనే హీరో హత్య చేస్తాడు. దానికి రీజన్ ఉంటుంది. ఒకళ్లు మనల్ని ఫాలో అవుతున్నారని తెలిసినప్పుడు మంచి చెప్పాలి.

  మురారిలో పెళ్లి పాట గురించి

  మురారిలో పెళ్లి పాట గురించి

  'మురారి'లో పెళ్లి పాట చివరిది. అప్పటికి ఓ 20 ఏళ్లుగా చివరి పాట మాంచి మాస్ బీట్ వస్తోంది. హీరో, నిర్మాత, యూనిట్ అందరూ అలాంటి సాంగ్ కావాలని పట్టుబట్టారు. పెళ్లి పాట ఏంటని విసుక్కున్నారు.

  దాంతో....

  దాంతో....

  'వేరే దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్‌తో మీకు కావలసిన పాట తీసుకోండి. నా పేరు తీసేసి సినిమా రిలీజ్ చేసుకోండి. ఆ సాంగ్ మినహా ఫస్ట్ కాపీ ఇచ్చేస్తాను. ఇప్పట్నుంచి ఈ సినిమాకి ఎవరు డెరైక్షన్ చేసినా.. నాకు ఓకే. నో అబ్జక్షన్ లెటర్ కూడా ఇస్తాను' అన్నా. ఇంతవరకూ చేసిన తర్వాత అలా ఎలా కుదురుతుందన్నారు. 'అలాగైతే ఈ పాటే ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకోండి' అన్నాను. ఆ పాట మన పెళ్లిళ్ల స్ట్రక్చర్ మార్చేసింది.

  శ్రీ ఆంజనేయం ఫ్లాఫ్ గురించి

  శ్రీ ఆంజనేయం ఫ్లాఫ్ గురించి

  'నువ్ చేస్తున్నది పూర్తిగా తప్పు' అని నేను నిజంగా గౌరవించే వ్యక్తులు 'శ్రీఆంజనేయం' తీసేటప్పుడు చెప్పారు. కొందరు ఈ లోకంలో కూడా లేరు. ఆ రోజున్న నా మానసిక స్థితికి ఎక్కలేదు. నేనే కరెక్ట్ అనుకున్నాను. నిర్మాతను కూడా నేనే కావడంతో కష్టనష్టాలు భరిద్దామనుకున్నాను. 'మీరు చెప్పినట్టు చేసుంటే బాగుండేదేమో' అని విడుదల తర్వాత నా తప్పు ఒప్పుకున్నాను. నేను తప్పు ఒప్పుకోవడానికి భయపడను.

  సింధూరం, ఖడ్గం

  సింధూరం, ఖడ్గం

  తలొంచి సినిమా తీస్తే వ్యభిచారం చేసినట్లుగా ఫీలవుతా. మనిషిని సమూలంగా చంపేసే వృత్తి వ్యభిచారం అని నా ఫీలింగ్. డబ్బు కోసం చూసుకుంటే 'సిందూరం', 'అంతఃపురం', 'ఖడ్గం' లాంటి సినిమాలొస్తాయా? నేనెవర్నీ తక్కువ చేయడంలేదు. అందరికంటే నేనే గొప్ప అనడంలేదు. అందరూ ఒక రూట్‌లో వెళితే ఈ రూట్‌లో ఎవరు వెళతారు?

  రమ్యకృష్ణ గురించి

  రమ్యకృష్ణ గురించి

  యాజ్ ఎ వైఫ్, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.. 'ఎందుకిలా? కరెక్ట్ కాదు' అంటుంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. 'సరేలే.. ఏం చెప్పి నిన్ను మార్చగలం' అని సెలైంట్ అయిపోతుంది. 'అది చూసే కదా నువ్వు పడ్డావ్. ఇప్పుడు మారమని ఎందుకు అంటున్నావ్?' అనడుగుతా (నవ్వుతూ). ఆవిడ ఏంజిల్ అండి.

  రమ్యకృష్ణ డబ్బులే..

  రమ్యకృష్ణ డబ్బులే..

  'శ్రీఆంజనేయం'కి రమ్యగారి డబ్బులు పెట్టారనే టాక్ ఉంది? ఇప్పటివరకూ తనది ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా 'ఐ డోంట్ కేర్'. తీసుకోలేదు కాబట్టే, మా జీవితం హాయిగా సాగుతోంది. ఆవిడ డబ్బులు టచ్ చేసిన మరుక్షణం నేను చనిపోయినట్లే. ఆ పరిస్థితి ఇప్పటివరకూ రాలేదు. ఎప్పటికీ రాదు కూడా.

  మా లవ్ స్టోరీ గురించి

  మా లవ్ స్టోరీ గురించి

  మా ఇద్దరి మధ్య ఉన్న ఓ అపురూపమైన అందమైన విషయం అది. చెబితే మా స్పేస్ మిస్సవుతుంది. ముందు ఎవరు ప్రేమలో పడ్డారు? ఎవరు పడేశారు? అనేవి పంచుకునే విషయాలు కావు. కొన్ని అమ్మే విషయాలుంటాయి. కొన్ని అమ్మకూడని విషయాలుంటాయి. కొన్ని అమ్మరానివి ఉంటాయ్. దిసీజ్ నాట్ ఫర్ సేల్ (నవ్వుతూ).

  జోకులేస్తారని

  జోకులేస్తారని

  సీతారామ శాస్త్రి గారు, రాఘవేంద్రరావు గారు, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్.. ఇలా కొందరి, మా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి వచ్చినోళ్లలో 90 శాతం మంది 'భలేవాణ్ణి పట్టిందిరా రమ్యకృష్ణ అని నిన్ను.. ఏం అమ్మాయిని పట్టాడని నన్ను' జోకులేస్తారు. ఇంతకు మించి ఎవ్వరైనా ఏమైనా అనుకుంటారని నీకుందా? అన్నాను. 'అందరూ ఇదే అనుకుంటారు' అని చెప్పింది.

  విడాకులు తీసుకున్నారని

  విడాకులు తీసుకున్నారని

  మీడియాలో నేను, రమ్యకృష్ణ విడాకులు తీసుకుంటున్నారని, గొడవపడ్డారనీ వార్తలు వస్తుంటాయి. సీరియస్‌గా తీసుకోం. ఏం న్యూస్ దొరికినట్టు లేదు మాపై పడ్డారనుకుంటా. రమ్యకు తెలుగు రాదు కాబట్టి, చదివి వినిపిస్తా. విని, 'అవునా?' అని కూల్‌గా అంటుంది.

  పవన్ తో అందుకే ...

  పవన్ తో అందుకే ...

  పవన్‌కల్యాణ్ ఓ క్రౌడ్ పుల్లింగ్ హీరో. కొన్ని కోట్లమంది జనం అతనంటే విపరీతంగా రియాక్ట్ అవుతారు. అంటే.. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఆశిస్తారు. ఆ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ నేను చేయాలి. హీరోతో పాటు అభిమానుల్ని శాటిస్‌ఫై చేయడం కోసం సినిమా తీయాలా? నాకనిపించిన పాయింట్ మీద సినిమా తీయాలా? నా పాయింట్‌కి సూట్ అయితే, వెళ్లి అడగడానికి రెడీ.

  అబ్బాయి రిత్విక్ గురించి?

  అబ్బాయి రిత్విక్ గురించి?

  బాగా షార్ప్, చార్మింగ్, అల్లరి. మా ఇద్దరి లక్షణాలు సమానంగా వచ్చేశాయి. 4 భాషలు మాట్లాడతాడు. నేను, రమ్య సెల్ఫ్‌మేడ్. మీరు ఇది అవ్వాలని చెబితే.. అయినవాళ్లం కాదు. ఇంతవరకూ హీరో అవుతానని, దర్శకుడు అవుతానని మాత్రం చెప్పలేదు.

  English summary
  When asked if the occasional rumours about Ramya Krishna planning to apply for divorce are true, Krishna Vamsi said that he and Ramya Krishna joke and laugh about such rumours, indirectly hinting that they both are still very much in love.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X