»   »  చిరంజీవి తాతను బూతుల నాయుడు అనే వారట!

చిరంజీవి తాతను బూతుల నాయుడు అనే వారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణ రాజు ఒకే ప్రాంతం నుండి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు నుండి సినిమా రంగం వైపు అడుగులు వేసిన వారే. ఈ రోజు 75వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు.

కృష్ణం రాజు పుట్టినరోజు వేడుకలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గురించిన ప్రశ్నలు ఎదురైనట్లు సమాచారం. చిరంజీవి సినిమాల్లోకి రాక ముందు మీకు తెలుసా? అని కృష్ణం రాజును అడగ్గా.... చిరంజీవి..మా తమ్ముళ్లకు తెలుసు గానీ, నాకు అప్పట్లో పరిచయం లేదు. కలవలేదు. మద్రాసులోనే కలిశాను. వాళ్ల గ్రాండ్ పేరెంట్స్ బాగా తెలుసు. చిరంజీవి తాతను బూతుల నాయుడు అనే వాళ్లం అంటూ కృష్ణంరాజు చెప్పినట్లు సమాచారం.

అయితే గతంలో కృష్ణం రాజు ఓ టీవీ ఇంటర్య్వూలో మాట్లాడుతూ... కూడా ఇలాంటి కామెంట్స్ చేసారు. అప్పటి వార్తే ఇపుడు మళ్లీ తెరపైకి వచ్చిందా? లేక మరోసారి ఆయనకు అలాంటి ప్రశ్నే ఎదురైతే ఫ్రెష్ కామెంట్స్ చేసారా? అనేది తెలియాల్సి ఉంది.

 Krishnam Raju about Chiranjeevi's grandfather

తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ప్రభాస్ వివాహం గురించి కూడా వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రభాస్ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడని, 2016లో ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరుగవచ్చు అన్నారు. నటుడిగా యాభైఏళ్ల కెరీర్ సంతృప్తికరంగా సాగిపోయిందని, ఎన్నో విలక్షణ కథా చిత్రాల్లో నటించే అవకాశం లభించింది. గొప్ప దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టం. సుదీర్ఘ కెరీర్‌లో మనసుకు నచ్చిన ఎన్నో పాత్రల్లో నటించే అవకాశం లభించింది. నా దృష్టిలో నిజమైన ఆర్టిస్టుకి సంతృప్తి అనేది ఉండదు. ఎన్ని చేసినా ఇంకా చేయాల్సినవి ఉంటాయి అన్నారు.

త్వరలో మా స్వీయనిర్మాణ సంస్థ గోపీకృష్ణమూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా త్వరలో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. కథకు అవసరమైతే ఈ సినిమాలో నేను నటించే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం. బాహుబలి-2 పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుందని తెలిపారు.

English summary
Krishnam Raju who is celebrating his birthday came with shocking revelations on Chiranjeevi. When asked whether he met Chiranjeevi before coming to films and whether he knew him, Krishnam Raju said he never met Chiranjeevi but his brothers knew him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu