»   » మహేష్ బాబు సోదరిని... కృష్ణం రాజు దత్తత ఆలోచన!

మహేష్ బాబు సోదరిని... కృష్ణం రాజు దత్తత ఆలోచన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి అమ్మాయి ప్రియదర్శినిని (మహేష్ బాబు సిస్టర్, సుధీర్ బాబు భార్య) రెబల్ స్టార్ కృష్ణం రాజు అప్పట్లో దత్తత తీసుకోవాలనే ఆలోచన చేసారా? అంటే అవుననే అంటున్నారు కృష్ణం రాజు. గురువారం జరిగిన ‘శ్రీ శ్రీ' ఆడియో వేడుకలో కృష్ణం రాజు తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘శ్రీ శ్రీ' ఆడియో వేడుకకు అతిథిగా హాజరైన కృష్ణం రాజు మాట్లాడుతూ....నాకు, కృష్ణ‌కు మ‌ధ్య గొప్ప అనుబంధం ఉంది. ఎంతంటే కృష్ణ అఖ‌రి అమ్మాయిని నేను ద‌త్త‌త తీసుకుంటానంటే ఇస్తాన‌ని అన్నారు.
మేమంతా ఒకే కుటుంబం. మా మ‌న‌సులు ఒక‌టే. ఎప్పుడైనా కృష్ణ వ‌స్తున్నాడంటే క‌ల‌వ‌డానికి నేను అతృత‌గా ఎదురుచూస్తాను. ఈ ఫంక్ష‌న్‌కు రావ‌డానికి అదే కార‌ణం కూడా అదే' అన్నారు.


Also Read: ఊహకు అందని విధంగా... సూపర్ స్టార్ కృష్ణ


Krishnam Raju about Krishna's daughter adoption plan

కృష్ణ 50 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన త‌ర్వాత శ్రీ శ్రీ సినిమాలో హుషారుగా త‌గ్గ‌కుండా యాక్ట్ చేశారు. త‌ను ఇదే హుషారుతో ఇంకా మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ముప్ప‌ల‌నేని శివ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవాలి. కృష్ణ నిర్మాత‌ల‌కే కాదు, సినిమా ఇండ‌స్ట్రీకే స‌పోర్ట్ చేశారు, కార్మికులకు పని కల్పించడానికి, ఇండస్ట్రీ బావుండాలని సంవత్సరానికి దాదాపు 15 సినిమాలు చేసే చేసేవారు' అని కృష్ణం రాజు వ్యాఖ్యానించారు.


సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల, న‌రేష్‌, సుధీర్ బాబు ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం శ్రీ శ్రీ. ఎస్‌.బి.ఎస్‌.ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వంలో చాట్ల సాయిదీప్‌, బాలు రెడ్డి.వై, షేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇ.య‌స్‌.మూర్తి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగింది.

English summary
Krishnam Raju about Krishna's daughter adoption plan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu