For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ ప్రేమ వివాహమైనా మాకు ఓకే: కృష్ణంరాజు (బర్త్ డే ఇంటర్వ్యూ)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: తెలుగు చిత్రసీమలోని ప్రముఖ నటుల లిస్టులో చిరస్థాయిగా నిలిచిపోయే నటుల్లో కృష్ణంరాజు ఒకరు. రెబల్‌స్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్న ఆయన నేడు(జనవరి 20) 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ ఏడాది జూన్ నెలతో ఆమన నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు.

  తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన భవిష్యత్ రాజీకాయ, సినీ ప్రణాళికతో పాటు తన వారసుడు ప్రభాస్ వివాహం గురించి కూడా వెల్లడించారు.

  నటుడిగా యాభైఏళ్ల కెరీర్ సంతృప్తికరంగా సాగిపోయిందని, ఎన్నో విలక్షణ కథా చిత్రాల్లో నటించే అవకాశం లభించింది. గొప్ప దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టం. సుదీర్ఘ కెరీర్‌లో మనసుకు నచ్చిన ఎన్నో పాత్రల్లో నటించే అవకాశం లభించింది. నా దృష్టిలో నిజమైన ఆర్టిస్టుకి సంతృప్తి అనేది ఉండదు. ఎన్ని చేసినా ఇంకా చేయాల్సినవి ఉంటాయి అన్నారు.

  త్వరలో మా స్వీయనిర్మాణ సంస్థ గోపీకృష్ణమూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా త్వరలో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. కథకు అవసరమైతే ఈ సినిమాలో నేను నటించే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం. బాహుబలి-2 పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుందని తెలిపారు.

  స్లైడ్ షోలో కృష్ణంరాజు చెప్పిన మరిన్ని విశేషాలు...

  ప్రభాస్ ఇంటర్నేషనల్ హీరో..

  ప్రభాస్ ఇంటర్నేషనల్ హీరో..


  బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ ఇంటర్నేషనల్ హీరో అయ్యాడు. దేశ వ్యాప్తంగా ప్రభాస్ ఇమేజ్ వ్యాపించింది. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో నన్ను చూసిన ఎంతోమంది బాహుబలి పెద్దనాన్న అంటూ పలకరించడం చెప్పలేని సంతోషాన్ని కలిగించింది. అన్నారు.

  చైనాలో బాహుబలి రికార్డ్ రిలీజ్

  చైనాలో బాహుబలి రికార్డ్ రిలీజ్


  చైనాలోని 5000 థియేటర్లలో త్వరలో బాహుబలి విడుదలకాబోతుంది. చైనాలో భారీస్థాయిలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా బాహుబలి రికార్డు సృష్టించబోతుందన్నారు.

  ప్రభాస్ పెళ్లి గురించి

  ప్రభాస్ పెళ్లి గురించి


  ఈ సంక్రాంతి పండగనాడు ప్రభాస్‌తో పెళ్లి గురించి ప్రామిస్ చేయించాను. ఈ ఏడాదే పెళ్లిచేసుకుంటానని ప్రభాస్ నాకు మాటిచ్చాడని కృష్ణంరాజు తెలిపారు.

  ఏ అమ్మాయి కుదరలేదు

  ఏ అమ్మాయి కుదరలేదు


  ప్రస్తుతం సంబంధాలు వెతికే పనిలో వున్నాం. ఒకవేళ వాడు ప్రేమ వివాహం చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పటికే ఓ అమ్మాయితో సంబంధం కుదుర్చుకున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కృష్ణంరాజు.

  ప్రేమ వివాహం అయినా ఓకే

  ప్రేమ వివాహం అయినా ఓకే


  ప్రభాస్ ప్రేమ వివాహం చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కృష్ణంరాజు తెలిపారు.

  టికెట్లు పెరిగాయి

  టికెట్లు పెరిగాయి


  ప్రస్తుతం పెరిగిన టికెట్ల రేట్లు ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నారు. సినీరంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం వుంది. చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులకు చేరువకావాలంటే 150, 200 సీట్ల కెపాసిటీతో కూడిన మినీ థియేటర్స్ నిర్మాణం జరగాలి. త్వరలో మినీ థియేటర్స్ చైన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది అన్నారు.

  English summary
  Rebel Star Krishnam Raju celebrates his 75th birthday Today. On this occasion, the veteran actor-filmmaker interacted with the media personnel in a freewheeling chat yesterday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X