»   » ప్రభాస్ పెళ్లి విషయం ఖరారు చేసిన కృష్ణం రాజు

ప్రభాస్ పెళ్లి విషయం ఖరారు చేసిన కృష్ణం రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఖరారు చేసారు. ‘ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటానని సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభాస్ నాకు ప్రామిస్ చేసాడు. అమ్మాయిని ఫైనల్ చేయడమే ఆలస్యం' అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ప్రభాస్ కు సరిజోడు అయ్యే అమ్మాయిని ఫైనలైజ్ చేయడంలో మా ఫ్యామిలీ అంతా బిజీగా ఉంది. ఈ సంవత్సరం ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరుగవచ్చు. ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అవ్వొచ్చు' అని కృష్ణం రాజు వెల్లడించారు. కృష్ణం రాజు మాటలు బట్టి ప్రభాస్ ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తున్నారా? అను అనుమానాలు తలెత్తుతున్నాయి.

Krishnam Raju confirms Prabhas marriage

‘బాహుబలి-2' షూటింగ్ తర్వాత ప్రభాస్ తన సొంత బేనర్ గోపి కృష్ణ మూవీస్ తో సినిమా చేస్తున్నాడని కృష్ణం రాజు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్టెనర్ గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాం. బాహుబలి 2 తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెలుతుంది అన్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ జేమ్స్ బాండ్ పాత్రకు దగ్గరగా ఉంటుంది. ప్రభాస్ అభిమానులకు నచ్చే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తాము అన్నారు కృష్ణం రాజు.

English summary
Tollywood's most eligible bachelor and Young Rebel Star Prabhas is going to get married this year. The news has been confirmed by the actor's uncle and Rebel star Krishnam Raju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu