»   » బాహుబలి 2 చూసిన కృష్ణం రాజు.... ఆయన ప్రతిభను మెచ్చుకోలేదేం?

బాహుబలి 2 చూసిన కృష్ణం రాజు.... ఆయన ప్రతిభను మెచ్చుకోలేదేం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి 2 సినిమా చూసిన రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమా ఎంతో అద్భుతంగా ఉందని సంతోషం వ్యక్తం చేసారు. చెప్పడానికి మాటల్లేవు... అంత గొప్పగా ఉంది. ప్రతి క్యారెక్టర్, ప్రతి ఇన్సిడెంట్, ప్రతి షాట్ రాజమౌళి గొప్పదనానికి నిదర్శనం. ఇండియాలో అందులో తెలుగులో ఇంటర్నేషనల్ లెవల్ కి తగిన ఒక డైరెక్టర్ ఉన్నాడని, అది రాజమౌళి అని ఈ సినిమాతో అందరికీ తెలిసిందని కృష్ణం రాజు అన్నారు. బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా రాజమౌళి స్పీల్ బర్గ్ కంటే గొప్పవాడు అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిదే.

ఆర్టిస్టులు కూడా చాలా గొప్పగా చేసారు. కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అని కృష్ణం రాజు అన్నారు. అయితే ప్రభాస్ గురించి కృష్ణం రాజు ఎక్కువగా మాట్లాడక పోవడం గమనార్హం. తన వారసుడి గురించి తానే ఎక్కువగా మాట్లాడటం అంతగా బావుండదనే ఉద్దేశ్యంతో కృష్ణం రాజు ఇలా అన్నట్లు స్పష్టమవుతోంది.


కృష్ణ రాజు భార్య శ్యామల మాట్లాడుతూ సినిమా అద్భుతంగా ఉందని, ప్రభాస్ రాజే కాదు, రాజులకు రాజు మహరాజులా ఉన్నాడని ఈ సినిమా చూసినవారు అనడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. ఇలాంటి సినిమాను ప్రభాస్ కు ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు.


కోహినూరు వజ్రం

కోహినూరు వజ్రం

కోహినూరు వజ్రానికి...ప్రభాస్ కి వెల కట్టలేమని, అలాంటి వజ్రం తమ ఇంట్లో ఉండటం తమ పూర్వజన్మ సుక్రుతమని శ్యామల పేర్కొన్నారు.


అంచనాలను అందుకున్న బాహుబలి

అంచనాలను అందుకున్న బాహుబలి

బాహుబలి-2 మూవీ అంచనాలను అందుకుంది. బాహుబలి 1 అద్భుతం అనుకుంటే బాహుబలి 2 దాన్ని మించిపోయింది. దర్శకధీరుడి ఐదేళ్ల కష్టానికి తగిన ప్రతిపలం దక్కింది.


హ్యాపీ ఫీలింగ్

హ్యాపీ ఫీలింగ్

సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఒక గొప్ప సినిమా చూసామనే ఫీలింగుతో థియేటర్ నుండి బయటకు వస్తున్నాడు. మంచి కథ, దాన్ని అద్భుంగా తీర్చి దిద్దిన వైనం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని స్పష్టమవుతోంది.


హాలీవుడ్ మూవీని తలపించిన గ్రాఫిక్స్

హాలీవుడ్ మూవీని తలపించిన గ్రాఫిక్స్

బాహుబలి సినిమాలోని గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాలను తలపించాయి. కొన్ని చోట్ల వాటిని మించిపోయాయి. అలాగని వాటి డోసు మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తపడ్డారు. మాహిష్మతి రాజ్యంతో పాటు యుద్ధసన్నివేశాల్లో ఏది గ్రాఫిక్సో, ఏది రియల్ లో తెలియనంత అద్భుతంగా, నేచురల్ గా గ్రాఫిక్స్ తీర్చి దిద్దారు.


హైలెట్స్

హైలెట్స్

సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యుద్ధ సన్నివేశాలు, ఆయుధాలు ఈ సినిమాలో మరింత కొత్తగా కనిపించడం కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. ఇంత గొప్ప సినిమాను తమకు అందించిన రాజమౌళికి ప్రేక్షకులు హాట్సాఫ్ చెబుతున్నారు.English summary
Veteran Tollywood actor Krishnam Raju showered praises on director Rajamouli after watching Baahubali 2 in a theatre in Hyderabad. Krishnam Raju said every scene and shot reflects the greatness of Rajamouli. We can proudly say that India has an international level director from Telugu, the actor stated.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu