»   »  బ్రహ్మీ...ప్రతీ ఎదవపనీ ఫేస్ బుక్ లో ...(వీడియో)

బ్రహ్మీ...ప్రతీ ఎదవపనీ ఫేస్ బుక్ లో ...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చేసే ప్రతీ ఎదవ పనీ ఫేస్ బుక్ లో పెడితే ఇలాగే ఉంటుంది అంటున్నారు సునీల్...బ్రహ్మానందంతో. సెల్ఫీ బర్ఫీ పేరుతో తనకో ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేసుకుని, ప్రతీవాళ్లతో సెల్ఫీ దిగి....ఫేస్ బుక్ లో పెట్టే పాత్రలో బ్రహ్మీ కనపడుతున్నాడు. ఇంతకీ ఏ సినిమాలో అంటారా...

కమిడయన్ నుంచి హీరోగా టర్న్ అయిన సునీల్ త్వరలో 'కృష్ణాష్టమి' ఫామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చేందుకు సిద్ధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కామెడీ ట్రైలర్ ని వదిలారు. ఈ ట్రైలర్ ని చూసేయండి..సినిమా ఫిబ్రవరి 19న విడుదల అవుతోంది.

ఒక ఎన్నారై కథతో రానున్న ఈ సినిమాకి జోష్ ఫేం వాసు వర్మ డైరెక్టర్. ఫ్యామిలీ కథా చిత్రానికి యాక్షన్ అంశాలను కూడా మిక్స్ చేసి చేసిన ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గార్లాని, డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటించారు. దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా సక్సెస్ పై సునీల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Krishnashtami Movie Comedy Trailer

" మా బ్యానర్ లో వస్తోన్న మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న నమ్మకం ఉంది.", అని దిల్ రాజు అన్నారు.

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫ్యామిలీవాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్" అన్నారు.

Krishnashtami Movie Comedy Trailer

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రానికి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం . ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

English summary
Watch the latest comedy trailer from the upcoming film Krishnashtami. Directed by Vasu Varma, the film is a love story of an NRI.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X