»   » డేటింగ్ లేదూ ఏమీ లేదు., అతన్ని నేను కలుసుకోవటం లేదు.... నోరువిప్పిన కృతీసనన్

డేటింగ్ లేదూ ఏమీ లేదు., అతన్ని నేను కలుసుకోవటం లేదు.... నోరువిప్పిన కృతీసనన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్‌కి జోడీగా నటించిన 'ఒన్‌.. నేనొక్కడినే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కృతి సనన్‌ ఆ తర్వాత నాగచైతన్య సరసన 'దోచెయ్' చిత్రంలోనూ నటించింది. వీటితోపాటు బాలీవుడ్‌లో నటించిన 'దిల్‌వాలే', 'హీరోపంటి' చిత్రాలు కృతికి మంచి పేరే తీసుకొచ్చాయి. పెళ్లి-సంసారం అనేవి మనం అనుకున్నప్పుడు జరిగిపోవని.. ముందు వెనకా టైమ్ పట్టొచ్చు ఏదో ఒకరోజు పెళ్లనేది చేసుకోవాల్సిందే. అది కొందరికి త్వరగా మరికొందరికి లేటుగా జరుగుతుంది. కాబట్టి కాస్త వెయిట్ చేయాలి..

ఇప్పటికైతే నావాడి గురించి ఆలోచించే టైమ్ లేదు. నా దృష్టంతా కెరీర్ పైనేనని ఆమధ్య చెప్పిన కృతి సనన్ నెల తిరక్క ముందే డేటింగ్ లో ఉందీ అంటూ వచ్చిన వార్తో అవాక్కాయ్యారంతా... అయినా పెళ్ళివద్దంది కానీ డేటింగ్ లో ఏముంది లే అంటూ సర్దుకోబోయారు కూడా. అయితే కృతి మాత్రం ఈ విశయం మీద క్లారిటీల మీద క్లారిటీలు ఇస్తూనే ఉంది.. తను ఎవ్వరితోనూ డేటింగ్ చేయటం లేదంతూ మళ్ళీ మళ్ళీ చెబుతోంది...

 Kriti Sanon on dating rumours with Sushant Singh Rajput

ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమాలకు పరిమితమైన ఈ భామ చుట్టూ అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం 'రబ్తా' సినిమాలో నటిస్తున్న కృతి.. ఆ సినిమాలో తన సహ నటుడైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్ చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.

అయితే, ఈ కథనాలను కృతి తోసిపుచ్చింది. తాను సుశాంత్‌ను ఏమాత్రం కలుసుకోవడం లేదని, ఇంతకంటే వివరణ ఇవ్వడానికి ఏమీ లేదని ఆమె స్పష్టం చేసింది. సుశాంత్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్టు వెలువడుతున్న కథనాలను ట్విట్టర్‌లోనూ కృతి ఖండించింది.

ఆ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది.,,'మాదారి' స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడింది. డేటింగ్ వార్తలపై స్పందించకుండా ఉండటమే మేలు అని తాను మొదట అనుకున్నానని, కానీ చిలువలు పలువలుగా కథనాలు వండి వారుస్తుండటంతో వాటిని ఖండిస్తూ తాను ట్విట్టర్‌లో వివరణ ఇచ్చానని, అంతకుమించి చెప్పాల్సిందేమీ లేదని ఆమె స్పష్టం చేసింది.

English summary
Kriti Sanon rubbishes rumours of dating Sushant Singh Rajput
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu