»   » రేప్ కాదు, కొట్టి చంపారు: హీరోయిన్ కృతిక హత్యకేసులో అసలు నిజాలు ఇవే....

రేప్ కాదు, కొట్టి చంపారు: హీరోయిన్ కృతిక హత్యకేసులో అసలు నిజాలు ఇవే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కృతికా చౌదరి అనుమానాస్పద మరణం ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు మిస్టరీని పోలీసులు వెంటనే చేధించారు. కృతికది హత్యే అని తేల్చిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అంధేరీ ప్రాంతంలోని తన అపార్టుమెంటులో కృతిక భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం గుర్తించారు. నాలుగు రోజుల నుండి ఆమె నివాసం ఉంటున్న ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో ఇరుగు పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా అర్ధ నగ్నంగా విగతజీవిగా కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహం పడి ఉండటం చూసి అంతా షాకయ్యారు.

రేప్ జరుగలేదని తేల్చిన పోలీసులు

రేప్ జరుగలేదని తేల్చిన పోలీసులు

కృతిక భౌతిక కాయం అర్దనగ్నంగా పడి ఉండటంతో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు మొదట అనుమానించారు. పోస్టు మార్టం నివేదిక అనంతరం ఆమెపై అత్యాచారం జరుగలేదని పోలీసులు తేల్చారు.

కున్ కుల్ డస్టర్‌తో కొట్టి చంపారు

కున్ కుల్ డస్టర్‌తో కొట్టి చంపారు

నిందితులు ఆమెను ఏ ఆయుధంతో చంపారు అనే విషయాన్ని పోలీసులు కనిపెట్టారు. పిడికిలికి ధరించే కున్ కుల్ డస్టర్ అనే ఆయుధంతో తలపై కొట్టి హత్య చేశారని పోలీసులు తెలిపారు.

పోలీసుల అదుపులో వ్యక్తి

పోలీసుల అదుపులో వ్యక్తి

చుట్టు పక్కలవారిని విచారించడంతో పాటు.... ఆమె ఇంటి పరిసరాల్లోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హత్యకు కారణం ఏమిటి?

హత్యకు కారణం ఏమిటి?

అయితే హత్యకు కారణం ఏమిటనే విషయాన్ని పోలీసులు ఇంకా తేల్చలేదు. అనుమానితుడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.

పుట్టినరోజు ఆనందం నుండి బయట పడకముందే...

పుట్టినరోజు ఆనందం నుండి బయట పడకముందే...

ఈ నెల 5వ తేదీనే కృతిక చౌదరి పుట్టినరోజు వేడుక జరుపుకుంది. ఆమె ఇంకా ఆ ఆనందం నుండి బయట పడక ముందే ఈ దారుణం చోటు చేసుకుంది.

అవకాశాల కోసం స్ట్రగుల్

అవకాశాల కోసం స్ట్రగుల్

27 సంవత్సరాల కృతిక చౌదరి భర్తతో విడిపోయి ప్రస్తుతం ముంబైలో ఒంటరిగా ఉంటోంది. బాలీవడ్లో సరైన అవకాశాలు లేక కొంతకాలంగా స్ట్రగుల్ అవుతోంది.

English summary
A 27-year-old struggling actress who was found dead in her apartment in Mumbai's Andheri suburb on Monday, died of a serious head injury, the police said on Tuesday. A murder case against an unidentified person has been registered. Kritika Chaudhary's decomposing body was discovered after neighbours complained of a stench from her home. The 27-year-old, who had a bit part in the 2013 Kangana Ranaut starrer "Rajjo", seemed to have been dead for three or four days, the police said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu