For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరీనా కపూర్‌తో నాలుగేళ్లుగా అఫైర్.. ఆమె నా గర్ల్‌ఫ్రెండ్ .. కమల్ ఖాన్ షాకింగ్ ట్వీట్

  By Rajababu
  |

  వివాదాస్పదమైన ట్వీట్లతో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు బాలీవుడ్ క్రిటిక్, నటుడు కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే). బాహుబలి రిలీజ్ సమయంలో ప్రభాస్, రాజమౌళి, రానా దగ్గుబాటిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఆర్కే ఆ తర్వాత తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరడమే కాకుండా చెంపలేసుకొన్నాడు. తాజాగా హృతిక్, కంగన రనౌత్ మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలో కేఆర్కే ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మతలబు ఏమిటంటే..

  కంగన, హృతిక్ వివాదం

  కంగన, హృతిక్ వివాదం

  ఇటీవల హిందీ జాతీయ చానెల్‌లో ప్రసారమయ్యే ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న కంగన రనౌత్.. హృతిక్ రోషన్ బట్టలూదీసినంత పనిచేసింది. భార్యతో గొడవపడివ హృతిక్ నా వద్దకు వచ్చి భోరున ఏడ్చేవాడు. దాంతో కరిగిపోయి నేను అతడికి దాసోహం అన్నాను. అంతేకాకుండా కొందరు నన్ను శారీరకంగా ఉపయోగించకొన్నారు అని కంగన సంచలన వ్యాఖ్యలు చేసింది.

  హృతిక్ రోషన్ ఆరోపణలు

  హృతిక్ రోషన్ ఆరోపణలు

  కంగన వ్యాఖ్యలను ఖండిస్తూ హృతిక్ రోషన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. కంగన అవాస్తవాలను చెప్పింది అని కంగనను హృతిక్ కడిగిపడేశాడు. అంతేకాకుండా తన వెనుక పడి నన్న వేధించేది అని కంగనపై ఆరోపణలు చేశాడు. దాంతో తన అక్క కంగనకు బాసటగా రంగోలి హృతిక్‌ను రఫాడించింది. ఆ క్రమంలో బాలీవుడ్ నటులు ఫరాన్ అక్తర్, కరణ్ జోహర్, సోనమ్ కపూర్ హృతిక్ మద్దతుగా నిలిచి కంగనను కడిగిపడేశారు.

  కంగన వివాదంలో తలదుర్చిన కేఆర్కే

  కంగన వివాదంలో తలదుర్చిన కేఆర్కే

  అలా హృతిక్, కంగన మధ్య వివాదం ఓ వైపు రసవత్తరంగా సాగుతుంటే మధ్యలో వివాదస్పద సినీ ప్రముఖుడు కేఆర్కే రంగంలోకి దూకి తలదూర్చేశాడు. కంగన సోదరి రంగోలిని భూతం అని ఎండగట్టాడు. హృతిక్‌తో ఫొటోలు దిగి మీడియాకు చూపిస్తే సరిపోతుందా అని కంగన, రంగోలిపై మండిపడ్డారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి కమల్ ఖాన్ ఆశ్చర్యకరమైన ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చూస్తే ఎవరికైనా మతిపోవడం ఖాయం.

  వివాదంలోకి కరీనా

  కంగనపై పరోక్షంగా చురకలు అంటిస్తూ సైఫ్ ఆలీ ఖాన్ సతీమణి, బాలీవుడ్ ముద్దు గుమ్మ కరీనా కపూర్ వివాదంలోకి లాగాడు. కరీనాతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పెట్టాడు. అంతటి సరిపోతే బాగుండేది కానీ కరీనా కపూర్‌తో నాలుగేళ్లుగా అఫైర్ ఉంది. నాతో డేటింగ్ చేసింది. ఆమె నా గర్ల్ ఫ్రెండ్. అందుకు సాక్ష్యం ఈ ఫొటోనే అని కేఆర్కే ట్వీట్‌లో పేర్కొన్నాడు.

  ఫొటోలతో నమ్మించలేవు

  ఫొటోలతో నమ్మించలేవు

  ఒకరితో ఫొటో దిగి నాకు ఆయనకు లింకు ఉంది అంటే సరిపోదు. అలాంటివి సవాలక్ష నేను చూపిస్తాను. వారితో వీరితో సంబంధాలు ఉన్నాయి అని చెపితే నమ్ముతారా అని కంగనకు కౌంటర్ ఇచ్చాడు. దాంతో జనాలకు దిమ్మ తిరిగిపోయింది. నిజంగానే కరీనాతో అఫైర్ ఉంది అంటాడని జనాలు దడుసుకొన్నారు.

  English summary
  KRK the favourite child of controversy is back again! This time he tweeted an explosive tweet of having an affair with Kareena Kapoor Khan. As already a feud between Kangana Ranaut and Hrithik Roshan is all around the corners. In this situation, By posting this photo with Kareena Kapoor KRK has taken a dig at Kangana’s claims of having dated Hrithik Roshan. And tweeted that I had a relationship with Kareena Kapoor for 4 Years n I have only this photo to prove.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X