»   »  'క్షణం' దర్శకుడు నెక్ట్స్ చిత్రం ఖరారు, హీరో ఎవరంటే

'క్షణం' దర్శకుడు నెక్ట్స్ చిత్రం ఖరారు, హీరో ఎవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చి పెద్ద హిట్ కొట్టి కోట్లు సంపాదించి పెట్టిన తెలుగు చిత్రం ఏదీ అంటే 'క్షణం' అనే చెప్పాలి. ఈ చిత్రం దర్శకుడు రవికాంత్ పేరాపు కు మంచి పేరు వచ్చింది. దాంతో అతన్ని వరస ఆఫర్స్ చుట్టముడుతున్నాయి. అయితే వాటిల్లో చాలా భాగం మళ్లీ కోటి తోనే లేక రెండు కోట్లు ఇలా అడుగుతున్నారట. కానీ రవికాంత్ ఆలోచనలు మాత్రం ధింక్ బిగ్ అన్నట్లు సాగి ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

రవికాంత్ తన తదుపరి చిత్రాన్ని రానా దగ్గుపాటి తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ... "నేను గత కొద్ది రోజులుగా ఓ లవ్ స్టోరీ మీద వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. చాలా నేరేషన్స్, మీటింగ్ లు ప్రొడక్షన్ హౌస్ తో జరిగాయి. ప్రస్తుతం రానా దగ్గుపాటితో ఈ లవ్ స్టోరీ చేయబోతున్నా ." అని చెప్పారు.

Kshanam director’s next with Rana Daggubati

దర్సకుడు మాట్లాడుతూ... నా నెక్ట్స్ చిత్రానికి క్షణం చిత్రానికి పోలిక ఉండదు. నిజాయితీగా చెప్పాలంటే...నేను ప్రస్తుతం స్క్రిప్టుని లాక్ చేసే పనిలో ఉన్నాను. రానా ఇంట్రెస్ట్ చూపెడుతన్నారు. స్క్రిప్టు విషయం ఓ కొలిక్కి వచ్చాకే, రానా, నేను ఇద్దరం ఈ విషయమై పూర్తిగా మాట్లాడగలం అన్నారు.

ప్రస్తుతం రానా ...బాహుబలి సీక్వెల్ పనిలో ఉన్నారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ గ్యాప్ లో ఓ రెండు చిత్రాలు చేసే ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా దర్శకుడు తేజ స్క్రిప్టుని సైతం ఓకే చేసినట్లు తెలుస్తోంది.

English summary
Kshanam director Ravikanth Perepu is gunning for bigger stars, namely Rana Daggubati.Ravikanth Perepu says that Rana Daggubati has shown interest in a script he is working on for his next film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu