twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుక్కలేజా(మహేష్ పై) పోకడ విషమిస్తోందా?

    By Bojja Kumar
    |

    ఇంటర్నెట్ విరివిగా వాడుకలోకి వచ్చిన తర్వాత సినిమాస్టార్లపై పేరడీలు చాలా కామన్ అపోయాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సినిమా స్టార్ల ఫోటోలు కామెడిగా మార్ఫింగ్ చేసి పెట్టడం, ఇద్దరు హీరోలకు సంబంధించిన అభిమానులు ఇంటర్నెట్‌ను వేదికగా చేసుకుని ఇతర హీరోలపై సెటైర్లు, దూషణలు చేయడమూ, వ్యవహారం చివరకు పోలీసుల వరకు వెళ్లిన ఘటనలూ మనం చూశాం. సినిమాలు చూసీ చూసీ అభిమానుల్లోనూ క్రియేటివిటీ తెగ పెరిగి పోతోంది. దీంతో తమ క్రియేటివిటీని బయట పెట్టుకోవడానికి ఇంటర్నెట్ ను వేదిక చేసుకుంటున్నారు. తామే స్వయంగా సెల్ ఫోన్లతో పేరడీ రూపంలో మినీ కామెడీ చిత్రాలు తీసి...ఇంటర్నెట్ లోకి వదులుతున్నారు.

    ఆ మధ్య మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా సినిమాకు పేరడీగా కుక్కలేజా అనే మినీ పేరడీ చిత్రాన్ని తీశారు కొందరు. అచ్చం మహేష్ బాబు ఖలేజా సినిమాలో ఉండే డైలాగులను, సీన్లను ఇమిటేట్ చేస్తూ కుక్క గురించి ఉంటుంది ఇందులో. అదే విధంగా రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్రకు పేరడీగా 'చాయ్ చరిత్ర' తీసి యూట్యూబ్ లో పెట్టారు మిరికొందరు. ఇందులో రక్త చరిత్ర సినిమాలోని డైలాగులను ఇమిటేట్ చేస్తన్నసీన్లు తెగ నవ్వు తెప్పిస్తాయి. అదే విధంగా జీటీవీలో ఓంకార్ నిర్వహిస్తున్న డాన్సింగ్ రియాల్టీ షోను, మరికొన్ని సినిమాలను ఇమిటేట్ చేస్తున్నారు. ఇదంతా సరదాగా సాగితే ఫర్వాలేదుగానీ...ఈ పోకడ విషమిస్తే కష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు.

    English summary
    Kukkaleja video a parody On Super star Mahesh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X