»   » ఎన్టీఆర్ "కుశ" లుక్: సూపరంతే, మరీ ట్రెండీ గాఉన్నాడు

ఎన్టీఆర్ "కుశ" లుక్: సూపరంతే, మరీ ట్రెండీ గాఉన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహస్తున్నఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. జై, లవ, కుశ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన 'జై' టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా లవ కుమార్ క్యారెక్టర్ పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు.

ఆ ఆనందం నుంచి పూర్తిగా తేరుకోకముందే వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ 'జైలవకుశ' నుండి గురువారం 'లవకుమార్' టీజర్‌ విడుదల చేసి అభిమానులకు పండుగ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. తాజాగా 'కుశ'ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

 kusa first look released from ntr starrer Jai lavakusa
Pawan Kalyan

బాబీ డైరెక్షన్‌లో వస్తున్న 'జై లవకుశ' మూవీలో ఎన్టీఆర్ 'జై, లవకుమార్, కుశ'లుగా త్రిపాత్రాభినయం చేస్తుండగా ఇప్పటికే 'జై, లవ, ఫస్ట్‌లుక్ టీజర్‌లు రిలీజ్ చేయగా వినాయక చవితినాడు 'కుశ' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు ఎన్టీఆర్. ఈ లుక్ లో ఎన్టీఆర్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ట్రెండీగా కనిపిస్తున్నాడు.

 kusa first look released from ntr starrer Jai lavakusa

ఈ నెలాఖరున కుశ టీజర్ ను కూడా రిలీజ్ చేసి సెప్టెంబర్ 3న అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్ ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

English summary
"Wishing everyone a Happy Vinayaka Chavithi. Here's Tarak as Kusa KusaFirstLook" Posted Nandamuri Kalyan Ram
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu