»   » ఆస్కార్‌లో చరిత్ర సృష్టించిన దర్శకుడు.. ప్రియురాలికి ప్రేమతో..

ఆస్కార్‌లో చరిత్ర సృష్టించిన దర్శకుడు.. ప్రియురాలికి ప్రేమతో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఓ యువ దర్శకుడు హిస్టరీ క్రియేట్ చేశాడు. అతిపిన్న వయస్సులో ఉత్తమ దర్శకుడి అవార్డును దక్కించుకొన్న డామియన్ చాజెల్లే చరిత్ర సృష్టించాడు. లా లా ల్యాండ్ చిత్రానికి దర్శకత్వం వహించిన డామియెన్‌ వయస్సు 32 ఏండ్లు మాత్రమే.

ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

ఈ అవార్డు అందుకోవడానికి సహాయపడిన వారందరికీ డామియన్ ధన్యవాదాలు తెలిపారు. తనతోపాటు ఈ అవార్డు రేసులో నిలిచిన దర్శకులను ప్రశంసించారు. ‘ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. గర్వంగా కూడా ఉంది' అని డామియన్ అన్నారు.

ప్రియురాలి హామిల్టన్ పేరును గట్టిగా..

ప్రియురాలి హామిల్టన్ పేరును గట్టిగా..

అవార్డు అందుకొన్న తర్వాత వేదికపైనే ప్రియురాలు ఓలివియా హామిల్టన్ ను పేరుతో పిలుస్తూ అరిచాడు. తాను అవార్డు అందుకోవడానికి సహాయం అందించిన కుటుంబానికి, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు.

ఆమెతో ప్రేమలో పడటం అదృష్టవంతుడిని

ఆమెతో ప్రేమలో పడటం అదృష్టవంతుడిని

నా ప్రియురాలు ఓలివియాకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ చిత్రం ప్రేమ నేపథ్యంగా తీసింది. ఈ చిత్రం తీస్తున్నప్పుడే ఆమెతో ప్రేమలో పడటం అదృష్టవంతుడిని అని డామియర్ అన్నారు.

డామియెన్‌ చాజెల్లే వయస్సు 36 ఏళ్లు

డామియెన్‌ చాజెల్లే వయస్సు 36 ఏళ్లు

డామియన్ అసలు పేరు డామియన్ సేరే చాజెల్లే. 1985 జనవరి 1న జన్మించాడు. 2009లో గయ్ అండ్ మేడ్‌లైన్ ఆన్ ది పార్క్ బెంచ్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత 2014లో విప్లాష్ చిత్రాన్ని రూపొందించాడు.

English summary
Damien Chazelle is the youngest person to win an Oscar for best director. His age is now 32 Years. He directed La La Land movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu