»   » సెప్టెంబ‌ర్ 11న జ‌య‌తి న‌టించిన 'ల‌చ్చి' చిత్రం టీజ‌ర్ లాంచ్

సెప్టెంబ‌ర్ 11న జ‌య‌తి న‌టించిన 'ల‌చ్చి' చిత్రం టీజ‌ర్ లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెన్నెల అనే పోగ్రాం నుండి ప్ర‌తి ఇంటి ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యిన జ‌య‌తి మెట్ట‌మెదటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. J9 4షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నాడు. హ‌ర్ర‌ర్ కామెడి లో ఒ కొత్త జోన‌ర్ ని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు. షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న‌ ఈ చిత్రం ఆడ‌యో ని అతిత్వ‌ర‌లో సినిప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌ల చేస్తారు. చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసి అక్టోబ‌ర్ లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. ల‌చ్చి చిత్రానికి సంబందించి మెద‌టి లుక్ టీజ‌ర్ ని సెప్టెంబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నారు.

ఈసంద‌ర్బంగా నిర్మాత‌, క‌థానాయిక జ‌య‌తి మాట్లాడుతూ "చాలా టీవి ప్రోగ్రామ్స్ ప్రోడ్యూస్ చేసిన అనుభవంతో మెట్ట‌మెద‌టిసారిగా సినిమా నిర్మాణం చెపట్టాను. అలాగే ఈ చిత్రం క‌థ న‌చ్చి నేను మెయిన్ లీడ్ పాత్ర‌లో న‌టించాను. హ‌ర్ర‌ర్ కామెడి జోన‌ర్ లో కొత్త జోన‌ర్ లో ఈ చిత్రాన్ని చేశాము. మా చిత్రానికి ల‌చ్చి అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ చిత్రం అంతా ల‌చ్చి పాత్ర చుట్లూనే తిరుగుతుంది.

lacchi movie teaser launch on september 11th

ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ అంద‌రూ ఈచిత్రంలో న‌టించారు. అంద‌రూ న‌వ్వించారుకూడా.. అలాగే లెజెండ్ కెమెరామెన్ యం.వి.ర‌ఘు తో ప‌నిచేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఆయ‌న ఈచిత్రాన్ని మ‌రో మెట్టుకి తీసుకువెళ్ళారు. మాట‌లు మరుదూరి రాజా అందించారు. మా చిత్రాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాము. మా చిత్రం యోక్క మెద‌టి లుక్ టీజ‌ర్ ని సెప్టెంబ‌ర్ 11న ప్ర‌సాద్ ల్యాబ్ లో ఉద‌యం 11 గంట‌ల‌కి విడుద‌ల చేయ‌నున్నాము. అతి త్వ‌ర‌లో సురేష్ యువ‌న్ అందించిన ఆడియో ని విడుద‌ల చేస్తాము. అక్టోబ‌ర్ లో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము." అని అన్నారు.

జ‌య‌తి, తేజ‌శ్విని, దిలిప్‌, చంద్ర‌మెహ‌న్‌, పూర్ణిమ‌, ర‌ఘుబాబు, ధ‌న‌రాజ్‌, షెకింగ్ శేషు, రామ్‌ప్ర‌సాద్ మెద‌ల‌గు వారు న‌టించ‌గా.. ద‌ర్శ‌కుడు- ఈశ్వ‌ర్‌, నిర్మాత‌- జ‌య‌తి ,కెమెరా- యం.వి.ర‌ఘు,మాట‌లు- మ‌రుదూరి రాజా, సంగీతం- సురేష్ యువ‌న్‌, ఎడిట‌ర్‌- ప్ర‌భు, సాహిత్యం- కందికొండ‌, ఆర్ట్ - వ‌ర్మ‌

English summary
TV Host Jayathi Movie Lacchi teaser launch planed on this month 11th
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu