»   » పాప్ స్టార్ లేడీ గాగా...అతడితో ఎంగేజ్డ్ (ఫోటో)

పాప్ స్టార్ లేడీ గాగా...అతడితో ఎంగేజ్డ్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: 2015 సంవత్సరం వాలంటైన్స్ డే పలువురు హలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌కు తీపి గుర్తుగా మిగిలి పోయింది. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా హాలీవుడ్ స్టార్స్ బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్, సోఫీ హంటర్ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా పాప్ స్టార్ లేడీ గాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Lady Gaga & Taylor Kinney Engaged on Valentine's Day, See Her Ring

వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రేమ, రిలేషన్ షిప్ గురించిన విషయాలు అఫీషియల్‌గా బయట పెట్టింది. టేలర్ కెన్నీతో తన ప్రేమ బంధాన్ని మరో లెవల్ పైకి తీసుకెలుతున్నట్లు వెల్లడించింది. ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బయట పెట్టడంతో పాటు తన ఎంగేజ్మెంట్ రింగ్ ఫోటోను కూడా పోస్టు చేసింది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘వాలంటైన్స్ డే రోజున అతని హృదయాన్ని నాకు ఇచ్చాడు. నేను వెంటనే సమ్మతించాను' అంటూ లేడీ గాగా చెప్పుకొచ్చింది. టేలర్ కెన్నీ లేడీ గాగాకు లవ్ షేపులో ఉండే రింగును వేలికి తొడిగాడు. ఇద్దరూ కలిసి డేట్‌కి వెళ్లి డిన్నార్ చేసారని, ఆ తర్వాత సరదాగా ఎంజాయ్ చేస్తూ గడిపారని తెలుస్తోంది.

Lady Gaga & Taylor Kinney Engaged on Valentine's Day, See Her Ring

లేడీ గాగా గురించిన విషయాల్లోకి వెళితే...ఇంటర్నేషనల్ పాప్ సంగీత ప్రపంచంలో లేడీ గాగా ఓ సంచలనం. అందరిలా కాకుండా.... ఇతరులకు పూర్తి భిన్నంగా, తనకంటూ ప్యతేకంగా, అవసరం అయితే అగ్లీ అవతారాల్లో సైతం కనిపించడం లేడీ గాగా ప్రత్యేకత. స్టేజీ షోలు, వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో ఆమె వేషధారణ, దుస్తువులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఒక్కోసారి ఆమె లుక్ చూసే వారికి వాంతికొచ్చే విధంగా ఉంటాయి. ఈ ప్రత్యేకతే ఆమెను పాపులర్ స్టార్‌ను చేసాయి. ఆమె వేషధారణ ఎంత డిఫరెంటుగా ఉంటుందో...ఆమె ఆల్బమ్స్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి.

English summary
2015's Valentine's Day brought us many romantic and good news from the celebrity couples. After hearing the wedding news of Benedict Cumberbatch and Sophie Hunter on Valentine's Day, fresh news from Lady Gaga just left us spellbound.
Please Wait while comments are loading...