»   » ఊరించినా, ఎవరూ ఊహించలేకపోయారు

ఊరించినా, ఎవరూ ఊహించలేకపోయారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :"రేపు మధ్యాహ్నం ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రకటించబోతున్నా. నాకు, నా కుటుంబానికీ అది చాలా ఆనందకరమైన వార్త'' అని మోహన్‌బాబు శనివారం ట్విటర్‌లో పోస్ట్ చేయగానే.. 'అంత ముఖ్యమైన వార్త ఏముంటుంది?' అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అది మంచు మనోజ్ పెళ్లి వార్తే అని ఒకరు.. కాదు, మోహన్‌బాబు మరోసారి తాత కాబోతున్నారు అని ఇంకొకరు.. ఇలా చాలామంది చాలా రకాలుగా ఊహించారు.

దీంతో.. "నా పెళ్లికి సంబంధించిన ఊహల్లో నిజం లేదు. పైగా అంతకన్నా ఆనందకరమైన విషయాన్ని ప్రకటించనున్నాం. మా కుటుంబంలో పండుగ వాతావరణం చోటు చేసుకోనుంది'' అని మనోజ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆ వివరణతో అందరి ఆసక్తీ రెట్టింపయింది. ఆదివారం మధ్యాహ్నానికి అందరి కుతూహలానికీ తెరపడింది. అందరి ఊహలను, అంచనాలను తల క్రిందులు చేస్తూ మంచు లక్ష్మి కి బిడ్డ పుట్టిన వార్త వచ్చింది.

Lakshmi Manchu blessed with a baby girl


"లక్ష్మీ ప్రసన్న తల్లయింది. సరగసీ విధానంలో అమ్మయింది. మా లక్ష్మికి ఆడపిల్ల పుట్టింది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. ఫాదర్స్ డే రోజున నా బిడ్డ నన్ను తాతను చేసి అపురూపమైన కానుకనిచ్చింది'' అని మోహన్ బాబు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆండీ శ్రీనివాసన్, మంచు లక్ష్మి దంపతులకు ఈ పాప తొలి బిడ్డ.

మోహన్‌బాబు కుమార్తె మంచు లక్షీప్రసన్న అమ్మయ్యారు. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా లక్ష్మీ ఆడ బిడ్డకు తల్లయినట్లు మోహన్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ''మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. పితృ దినోత్సవం సందర్భంగా నాకు మా లక్ష్మీ ఇచ్చిన బహుమతి ఇది. ఇప్పటికే ఇంట్లో పండగ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకున్నాం'' అన్నారు మోహన్‌బాబు.

ఇటీవల బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్-కిరణ్‌రావు, షారుక్‌ఖాన్-గౌరి, సొహాయిల్ ఖాన్-సీమాఖాన్ వంటి దంపతులు ఈ విధానంలో తల్లిదండ్రులయ్యారు. పాశ్చాత్య దేశాల్లోనూ.. పాప్‌స్టార్ మైఖేల్ జాక్సన్, రికీమార్టిన్, నికోల్ కిడ్‌మన్ వంటి పలువురు ప్రముఖులు ఈ విధానం ద్వారా బిడ్డలను పొందారు.

English summary
Mohan Babu’s lone daughter Manchu Lakshmi became mother through surrogacy. She gave birth to a baby girl on Sunday. When Mohan Babu and manoj tweeted on Saturday, saying.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu