»   » నీ మొకానికి అమ్మాయి కూడా పడిందా? అల్లు శిరీష్ పై లక్ష్మి మంచు పంచ్

నీ మొకానికి అమ్మాయి కూడా పడిందా? అల్లు శిరీష్ పై లక్ష్మి మంచు పంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు లక్ష్మి ఇంగ్లిష్ యాక్సెంట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆవిడ ఇంగ్లిష్ ప్రభావం తెలుగు మాట్లాడేటప్పుడుకూడా స్పష్టంగా తెలిసిపోతుంది. నిజానికి కాస్త ఫన్నీ గా అనిపించినా అలవాతైపోవటం తో ఆమె అలానే కంటిన్యూ అయిపోతున్నారు. అయితే నటనలో మాత్రం ఆ ప్రభావం కనిపించదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంత కష్తపడతారో గానీ సినిమాల్లో మాత్రం ఆమె ఇంగ్లిష్ యాక్సెంట్ తెలుగు మాత్రం అక్కడ కనిపించదు.

అయితే మంచు లక్ష్మి దగ్గర ట్యూషన్ చెప్పించుకొని మరీ ఇంగ్లిష్ నేర్చుకున్న... యువహీరో ఒకరున్నారు. అదెవరో తెలుసా? అల్లువారి చిన్నబ్బాయి శిరీష్. అయితే ఈ ట్యూషన్ ఏ స్కూల్ టైం లోనో మరేదో ఇంటర్వ్యూ కోసమో కాదు. ఫేస్ బుక్ లో పరిచయమైన అమ్మాయికి లైనెయ్యటానికట... ఎంతైనా కుర్రాడు కదా.. మరి ఆ ఇంగ్లిష్ పిల్లని పడెయ్యటానికి మంచు లక్ష్మి దగ్గర ట్రైనింగ్ అన్న మాట.. ఇంతకీ ఈ సంగతంతా ఎవరు చెప్పారూ.., ఎప్పుడు జరిగిందీ అనే కదా....

Lakshmi Manchu Hilarious Punch To Allu Sirish Shocks Everyone

ఇటీవల జరిగిన సైమా అవార్డ్ ఫంక్షన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మి వద్ద ఇంగ్లిష్ పాఠాలు నేర్చుకున్నాడు. తనకు ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయమైందని లక్ష్మితో అన్నాడు. అతడు అలా అనగానే 'నీ ఫొటోయే పెట్టావా?' అంటూ సటైర్ విసిరింది లక్ష్మి. లేదు.. బన్నీ ఫొటోను పెట్టి ఆ అమ్మాయిని పడేశానని శిరీష్ చెప్పాడు. చాట్ చేస్తున్నంత సేపు బాగానే ఉంది కానీ.. ఆ అమ్మాయి 'లెట్స్ టాక్ ఇన్ ద ఫోన్' అనగానే భయం పట్టుకుందని శిరీష్ అన్నాడు.

ఆమె తన ఇండియన్ ఇంగ్లిష్ విని తాను తెచ్చుకున్న ఇంప్రెషన్ పోతుందేమోనని డౌట్ కలుగుతోందన్నాడు. కాబట్టి అమెరికన్ ఇంగ్లిష్ ఎలా మాట్లాడాలో నేర్పాలంటూ లక్ష్మిని అడిగాడు శిరీష్. దీంతో 'వాటర్', 'ఐ లవ్ యూ' అన్న పదాలను పలకడమెలాగో చెప్పింది మంచు లక్ష్మి. కొన్ని అక్షరాల మధ్య తేడాను వివరించింది. ఆ తర్వాత వెంటనే మీతో రెండు ముక్కలు నేర్చుకుని మొత్తం అమెరికన్ యాక్సెంట్‌ని పట్టేశానని శిరీష్ అన్నాడు. ఇది ఫంక్షన్‌కు వచ్చిన వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. అలా మంచు వారి అమ్మాయి టీచరు, అల్లువారి పిల్లవాడు విద్యార్థి అయ్యారన్నమాట.

English summary
Allu Sirish Making Fun & Teasing Manchu Lakshmi Language and Lakshmi Manchu Hilarious Punch To Allu Sirish Shocks Everyone
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu