»   » సెక్సీ పోస్టర్‌పై మంచు లక్ష్మి అభ్యంతరం

సెక్సీ పోస్టర్‌పై మంచు లక్ష్మి అభ్యంతరం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వంశీ దర్శకత్వంలో దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన 'లేడీస్ టైలర్' తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాగా నిలిచి పోయింది. అప్పటి పరిస్థితులను ఫోకస్ చేస్తూ ఆ సినిమా ఉంటే... ఇప్పటి లేటెస్ట్ ట్రెండుకు తగిన విధంగా 'ఫ్యాషన్ డిజైనర్' పేరుతో తాజాగా ఓ సినిమా మొదలు పెట్టారు వంశీ. సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అనేది సబ్ కాప్షన్.

మంచు లక్ష్మి అభ్యంతరం

మంచు లక్ష్మి అభ్యంతరం

తాజాగా ఫ్యాషన్ డిజైనర్ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ రిలీజైంది. అయితే ఈ పోస్టర్ అభ్యంతర కరంగా ఉందంటూ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేసారు. మరి మంచు లక్ష్మి లేవనెత్తిన అంశంపై చిత్ర దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో?

లేడీస్ టైలర్ సీక్వెల్

సినిమా వివరాల్లోకి వెళితే... సుమంత్ అశ్విన్ హీరోగా ఫ్యాషన్ డిజైనర్ తెరకెక్కిస్తున్న వంశీ ఈ చిత్రంలో లేడీస్ టైలర్ హీరో రాజేంద్ర ప్రసాద్ తో కూడా ఓ ముఖ్య పాత్ర చేయించినట్టు తెలుస్తుంది.

సుమంత్ అశ్విన్

సుమంత్ అశ్విన్

ఈ చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజతో లేదంటే యంగ్ హీరో రాజ్ తరుణ్ తో చేయాలని వంశీ భావించాడు. కాని ఫైనల్ గా సుమంత్ అశ్విన్ హీరోగా లేడీస్ టైలర్ సీక్వెల్ తెరకెక్కించారు. కొన్ని నెలుగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ కోనసీమ పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించడం జరిగింది.

మధుర శ్రీధర్

మధుర శ్రీధర్

రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మధుర శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనీషా అంబ్రోస్, ఈషా, మానస కథానాయికలుగా కనిపించనున్నారు.

English summary
Lakshmi Manchu raises objection over Fashion Designer poster. "When will we stop objectifying women like this. " Lakshmi Manchu tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu