»   » రసవత్తరంగా వెన్నుపోటు పర్వం: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత వైసీపీ నేత!

రసవత్తరంగా వెన్నుపోటు పర్వం: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత వైసీపీ నేత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ.... తాజాగా ఈ చిత్ర నిర్మాత‌ను కూడా ఫైనల్ చేశాడు.

వై.ఎస్.అర్.సి.పి నేత పి.రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నారని వర్మ అఫీషియల్‌గా ప్రకటించారు. మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని... అని ఆర్జీవీ స్పష్టం చేశారు.

రసవత్తరంగా వెన్నపోటు పర్వం

రసవత్తరంగా వెన్నపోటు పర్వం

ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఆయన్ను వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే విషయాలు చూపించబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశం అయింది.

Lakshmi’s NTR: Naked and Exposed Biopic, RGV Confirms
లక్ష్మీ పార్వతి కోణంలో...

లక్ష్మీ పార్వతి కోణంలో...

ఈ సినిమా పూర్తిగా లక్ష్మీ పార్వతి కోణంలో ఉండబోతోంది. లక్ష్మీ పార్వతి ఇప్పటికే వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఇపుడు ఈ సినిమా నిర్మాత కూడా వైసీపీ నేత కావడంతో..... సినిమా పూర్తిగా ఆమె కోణంలో, ఆమెకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

ఎవరిని విలన్‌గా చూపిస్తారో?

ఎవరిని విలన్‌గా చూపిస్తారో?

లక్ష్మీ పార్వతి కోణంలో సినిమా ఉంటే.... ఈ సినిమాలో ఎవరిని విలన్ గా చూపిస్తారో? ఎవరిని వెన్నుపోటు దారుడిగా చూపిస్తారో? తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే జరిగితే సినిమా అత్యంత వివాదాస్పద చిత్రం కావడం ఖాయం.

శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో?

శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో?

అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అన్నీ అశేషతెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను అని వర్మ ఇప్పటికే ప్రకటించారు.

నీ అబ్బ సొత్తా?...... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఇష్యూపై ఆర్జీవీ ఘాటుగా రిప్లై!

నీ అబ్బ సొత్తా?...... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఇష్యూపై ఆర్జీవీ ఘాటుగా రిప్లై!

ఈ సినిమా విషయంలో తనను టార్గెట్ చేసిన వారికి వర్మ ద్వారా ఘాటుగా సమాధానం ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"Lakshmi's NTR" producer is YSRCP leader Rakesh Reddy. Director RGV confirms this news. Few days back Ram Gopal Varma has unveiled the first look of Lakshmi's NTR, a film on legendary NTR and his life especially towards his end.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu