»   » ఆ కోరికలు తీరకుండానే అనంత లోకాలకు అక్కినేని!

ఆ కోరికలు తీరకుండానే అనంత లోకాలకు అక్కినేని!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో దాదా పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావుకు ప్రత్యేక స్థానం ఉంది. 90 ఏళ్ల వయసున్న ఆయన 75 ఏళ్లకు పైగా ఈ రంగంలో కొనసాగుతున్నారు. ఇన్నేళ్లు సినీ నటుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. ఇన్నేళ్ల ఆయన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు చేశారు.

  అయితే అక్కినేనికి తీరని కోరికలు ఇంకా రెండు ఉన్నాయట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన తన మసులోని మాట బయట పెట్టారు. తెలుగు కవి యోగి వేమన, రామకృష్ణ పరమ హంసలు అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను ఇష్టపడే ఈ ఇద్దరి పాత్రలు చేసే అవకాశం రాలేదని అక్కినేని చెప్పుకొచ్చారు.

  యోగి వేమన గొప్పకవి. ఆయన జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అలాగే రామకృష్ణ పరమ హంసగా కూడా నటించాలనుకున్నాను అని తెలిపారు. ఈ రెండు పాత్రలకు న్యాయం చేయగలననేది నా నమ్మకం. కానీ నేను నటించే సమయంలో ఎవరూ ఈ ప్రయోగం చేయలేదని చెప్పుకొచ్చారు.

  ఇటీవల ఆయనకు అవకాశం వచ్చినా... వయసు ఆ పాత్రకు సరితూగదని తిరస్కరించినట్లు అక్కినేని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో నేను ఒక భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఎలాంటి కష్టాలు లేకుండా ఈ స్థాయికి ఎదగడం తన అదృష్టమని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

  90 ఏళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా ఉండే అక్కినేని.....మరణ వార్తను తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేక పోతోంది. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధతో బాధ పడుతున్న అక్కినేని మంగళవారం అర్ధరాత్రి దాటాక అక్కినేని నాగేశ్వరరావు వూపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి ఆక్సిజన్‌ పెట్టారు. తరువాత పదినిమిషాలకే ఆసుపత్రికి వచ్చిన డా.సోమరాజు వైద్యుల బృందంతో కలసి పరిశీలించారు. అప్పటికే శ్వాస ఆగిపోవటంతో ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తెలిపారు.

  English summary
  "There are two roles that I wanted to do-The great Telugu poet Yogi Vemana and Ramakrishna Paramahamsa. I started growing a beard and that's when I thought I would be able to do justice to the role of Ramakrishna Paramahamsa. But no one was ready to experiment with that" late Akkineni said in the interview.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more