»   » దిల్ రాజు క్యాంప్ కు రాక్షసి

దిల్ రాజు క్యాంప్ కు రాక్షసి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'అందాల రాక్షసి' చిత్రంలో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠి కి కెరీర్ అనుకున్నంత వేగంగా లేదు. అయితే ఆమెకు లక్కీగా మంచి ఆఫర్ వచ్చింది. దిల్ రాజు క్యాంప్ నుంచి పిలుపు వచ్చింది. దిల్ రాజు నిర్మిస్తున్న 'కేరింత' చిత్రంలో హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. సాయి కిరణ్ అడవి..(వినాయకుడు ఫేమ్) డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఆమెకు కీ రోల్ దొరికింది. ఈ చిత్రంలో ఆమె యాంబిషియస్ లేడీగా కనిపించనుంది. అలాగే సుమంత్ అశ్విన్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక అయ్యారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మిగతా కీలకమైన పాత్రల్లో కొత్తవాళ్లు నటిస్తున్నారు. ఇందుకోసం స్టార్ హంట్ నిర్వహించారు.

Lavanya Tripathi to romance Sumanth Ashwin

సాయికిరణ్‌ అడవి మాట్లాడుతూ... ''ఈ కథపై ఎప్పట్నుంచో కసరత్తులు సాగుతున్నాయి. అబ్బూరి రవి మాతో కలవగానే కథ కొత్తరూపం సంతరించుకొంది'' అన్నారు. ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ ని ఈ మూవీతో పరిచయం చేస్తున్నారు.

''ఇదివరకు మా సంస్థలో చిన్న సినిమాల్ని తెరకెక్కించాం. కొంతకాలంగా స్టార్‌ హీరోల చిత్రాలకే పరిమితమయ్యాం. ఐదేళ్ల తర్వాత మళ్లీ 'కేరింత' పేరుతో ఓ చిన్న చిత్రాన్ని మొదలుపెడుతున్నాం. కుర్రకారు మనోభావాల్ని ఆవిష్కరించే కథ ఇది. సాయికిరణ్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రచయిత అబ్బూరి రవితో కలిసి ఆ కథని మరింత బాగా తీర్చిదిద్దాం. ఈ చిత్రంతో కొద్దిమంది సాంకేతిక నిపుణులను కూడా పరిచయం చేస్తున్నాం.'' అన్నారు దిల్‌రాజు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌.

English summary
Lavanya Tripathi is all set to romance Sumanth Ashwin in an upcoming film, Kerintha. Sai Kiran Adivi is directing the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu