»   »  పవన్‌, ప్రభాస్, అలీ, ఎస్పీ సాయం! , ఫోన్ లో పవన్ సందేశం,రాజమౌళి అత్తగారు కూడా

పవన్‌, ప్రభాస్, అలీ, ఎస్పీ సాయం! , ఫోన్ లో పవన్ సందేశం,రాజమౌళి అత్తగారు కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌:మన సినిమా సెలబ్రెటీలలో ఓ సుగుణం ఉంది. కేవలం తమ సంపాదన మాత్రమే కాకుండా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవాలి, కష్టాల్లో ఉంటే చేయూత ఇవ్వాలని పనిచేస్తూంటారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా మరో సారి మన తెలుగు సిని సెలబ్రెటీలు దాతృత్వం యాంకర్ సుమ సాక్షిగా వెల్లడైంది.

టాలీవుడ్ ప్రముఖులు పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌, ఎస్పీ బాలసుబ్రమణ్యం, మంచు లక్ష్మి తదితరుల సహాయంతో వృద్ధాశ్రమానికి భవనాన్ని నిర్మించినట్లు యాంకర్‌ సుమ కనకాల తెలిపారు. తాజాగా ఆ ఆశ్రమాన్ని ప్రారంభించినట్లు తెలుపుతూ.. తన ఫేస్‌బుక్‌లో కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఇక ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ఫోన్ లో తన సందేశం వినిపించారు.

ఆపదలో ఉన్న వారికి చేసిన సేవ భగవంతు డికి చేసిన సేవతో సమానమని సినీనటి మంచు లక్ష్మి, యాంకర్ సుమ కనకాల అభి ప్రా యం వ్యక్తం చేశారు. జెమినీ టీవీలో ప్రసారమయ్యే మేము సైతం ప్రోగ్రాం ద్వారా ఇటివల ఖమ్మం నగరం పాండురంగాపురంలోని జీసెస్ అనాధ వృద్దాశ్రమ భవనం నిర్మాణానికి ఆర్ధిక సహాయాన్ని అందించారు. నిర్మాణం పూర్తయిన భవనం ప్రారం భోత్సవం జరిగింది.

 పేరు పేరునా

పేరు పేరునా


అందరం కలిసి చివరికి వృద్ధాశ్రమాన్ని నిర్మించామని ఆనందం వ్యక్తంచేశారు. మంచు లక్ష్మి, రాధమ్మకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆశ్రమం నిర్మించడానికి సహాయం చేసినవారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

 వీరందిరికి ప్రత్యేకంగా..

వీరందిరికి ప్రత్యేకంగా..

పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌, ఎస్పీ బాలసుబ్రమణ్యం, అలీ, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, వివేక్‌, అయ్యదేవర శ్రీనివాస్‌, పీవీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. దీనికి అంతటికీ కారణం ఖమ్మం లక్ష్మి అమ్మ అని, ఆమెను, ఆమె కుటుంబాన్ని అభినందిస్తున్నానని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

తన జీతంతోనే

తన జీతంతోనే

ఖమ్మంకు చెందిన లక్ష్మి కొంతమంది వృద్ధుల కోసం సొంతంగా వృద్ధాశ్రమాన్ని నడిపేవారు. తనకు వచ్చే రూ. 50 వేల జీతంతో ఆశ్రమానికి కావాల్సినవన్నీ సమకూర్చేవారు. అలా చాలాకాలం నడిపారు.

 మేము సైతం లో పాల్గొని

మేము సైతం లో పాల్గొని


అయితే ఆమె పదవీ విరమణ పొందాక పెన్షన్‌తో ఆశ్రమ నిర్వహణ కష్టం కావడంతో దాతల విరాళాలతో నడుపుతూ వచ్చారు. కొందరి సహాయంతో ఇటీవల ఆమె ‘మేము సైతం' కార్యక్రమంలో పాల్గొన్నారు.

 భవంతిని నిర్మిస్తే...

భవంతిని నిర్మిస్తే...

ఆ పోగ్రామ్ లో... సుమ, మంచు లక్ష్మి కొంత ఆర్థిక సహాయం అందించారు. ఆ తర్వాత భవంతి ని నిర్మిస్తే బాగుంటుందని నిర్ణయంచుకున్నారు. అందుకు విరాళాలు సేకరించారు సుమ. దాని ఫలితం ఈ రోజు ఎంతో మంది కళ్ళల్లో సంతోషం.

 అద్దె భవనం దొరికటం లేదని

అద్దె భవనం దొరికటం లేదని

గతంలో తాను పవన్‌కల్యాణ్‌ని కలిశానని, ఆయన ఆర్థిక సాయం చేశారని లక్ష్మి చెప్పారు. ఆశ్రమానికి అద్దె భవనం దొరకడం కూడా కష్టంగా మారిందని ఆమె చెప్పడంతో అందరూ కలిసి విరాళాలు సేకరించి మొత్తానికి సొంత భవనం ఏర్పరిచారు.

 అతిధులు వీళ్లే

అతిధులు వీళ్లే


ఈ భవం ప్రారంభోత్సవానికి ఖమ్మం ఎమ్మె ల్యే పువ్వాడ అజయ్ కుమార్, ప్రముఖ సినీ నటీమణులు కనకాల సుమ, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారం భించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు.

 ఏడు పదుల వయస్సుకు

ఏడు పదుల వయస్సుకు


యాంకర్ సుమ మాట్లాడుతూ... మానవ సేవే మాధవ సేవ అనే పదాన్ని పునికి పుచ్చుకొని ఏడు పదుల వయస్సుకు వచ్చిన అనాధ వృద్దులను చేరదీసి సేవ చేస్తున్న ఆశ్రమ నిర్వాహకురాలు నండూరి లక్ష్మీ రాజును ముందుగా యాంకర్ సుమ ప్రత్యేకంగా అభినందించారు.

 భరోసా ఇస్తాయి

భరోసా ఇస్తాయి


అయినవాళ్లందరూ ఉండి ఆదరణకు దూరమైన వారు నేటి సమాజంలో అనేక మంది ఉన్నారని సుమ ఆవేధన వ్యక్తం చేశారు. అటువంటి వారికి ఇలాంటి వృద్దాశ్ర మాలు మేమున్నామంటూ భరోసాను అందించడంతో పాటు ఆధరించి సపర్యలు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ప్రసంసించాలన్నారు సుమ.

 పూర్వజన్మ సుకృతం.

పూర్వజన్మ సుకృతం.

వృద్దులకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావించాలని ఆమె పేర్కొన్నారు. పదవీ విరమణ తరువాత శేష జీవి తాన్ని కుమారులు, మనవళ్లతో సరదాగా గడపాలని అనేక మంది ఆలోచన చేస్తుంటా రని, అందకు బిన్నంగా ఆశ్రమ నిర్వాహకురాలు లక్ష్మీ రాజు మాత్రం ఉద్యోగ విర మణ పొంది కూడా ఎంతో ఓపికగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్దులకు సేవ చేయ డం హర్షించదగిన విషయమన్నారు సుమ.

 రాజమౌళి అత్తయ్యగారిని

రాజమౌళి అత్తయ్యగారిని

నేటి రోజుల్లో డబ్బు సంపాధన ముఖ్యం కాద ని, సంపాదించిన దానిలో కొంత పేదలకు సహాయం చేయాలను కోవడం గొప్ప విషయమన్నారు. జీసెస్ వృద్దాశ్రమానికి తమ వంతు బాధ్యతగా సేవ చేయడం ఎంతో సంతృప్తిని కలిగించిందని సుమ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వృద్దాశ్రమా నికి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన బాహుబలి సినిమా ధర్శకుడు రాజమౌళి ఆత్తయ్య వళ్లూరి పల్లి రాదమ్మకు రుణపడి ఉంటామన్నారు.

 మేము సైతం ఉద్దేశం కూడా ..

మేము సైతం ఉద్దేశం కూడా ..

సినీ నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ....సమాజంలో అనేక మంది పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారని, అటువంటి వారిని చేరదీసి వారి కష్టాల్లో భాగస్వాములం కావాలనే ఉద్దేశంతోనే మేము సైతం కార్య క్రమాన్ని చేపట్టినట్లు సినీ నటి మంచు లక్ష్మీ పేర్కొన్నారు.

ఆదరణ చూస్తూంటే

ఆదరణ చూస్తూంటే

మేము సైతం కార్య క్రమా నికి తెలుగు రాష్ర్టాల్లో మంచి ఆధరణ లభిస్తోందన్నారు. ప్రజల్లో లభిస్తున్న ఆధరణను చూస్తుంటే దేశాన్ని కూడా బాగు చేయగలననే నమ్మకం ప్రోగ్రాం ద్వారా కలుగుతోం దన్నారు మంచులక్ష్మి.

 సంతోషంగా ఉంది

సంతోషంగా ఉంది


ఎంతో నిజాయితీగా అనాధ వృద్దులకు ఆశ్రయం కల్పిస్తున్న పాండురంగా పురంలో వృద్దాశ్రమానికి మేము సైతం ద్వారా శాశ్వ త నివాసాన్ని ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కారణమైన ధర్శక నిర్మాత రాజమౌళి అత్తయ్య రాధమ్మకు మంచు లక్ష్మి కృతజ్ఞతలు తెలియ జేశారు. వృద్దాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్దులను ఆనాధలుగా చూడకుం డా కుటుంబ సభ్యులు గా భావించి మంచి వాతావరణాన్ని కల్పించాలని మంచు లక్ష్మి స్థానికులను కోరారు.

 సహాయం అందిస్తా

సహాయం అందిస్తా


ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ..నిజాయితీగా వృద్దులను చేరదీసి సేవలందిస్తున్న వృద్దాశ్రమానికి తన వంతు సహాయాన్ని అందిస్తానని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వృద్దాశ్రమ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడా రు. తన నియోజకవర్గ పరిధిలో అనాధ వృద్దులకు సేవ చేసే ఆశ్రమం నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు.

 సమయం కేటాయించటం

సమయం కేటాయించటం


ఇందుకు సినీ నటీమణులు తమ సమా యాన్ని అందించడం గర్వంగా ఉందన్నారు. పాండురంగాపురంలో నిర్వహిస్తున్న వృద్దాశ్రమానికి ఎటువంటి సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తానని నిర్వాహ కురాలు లక్ష్మీరాజు కు భరోసాని అందించారు.

 పవన్ సేవలు

పవన్ సేవలు


అనంతరం ఆశ్రమ నిర్వాహకు రాలు లక్ష్మీరాజు మాట్లా డుతూ..2010లో ఆశ్రమం ప్రారంభిచానని,అందుకు కారణాలు, సహకరించిన దాతల పేర్లను వెల్లడించారు. సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆశ్రమ నిర్వహ ణకు అందించిన సేవలను వివరించారు. ఫోన్ ద్వారా పవన్ కళ్యాణ్ సందేశాన్ని వినిపిం చారు.

 ఫోటోలు తీసుకున్నారు

ఫోటోలు తీసుకున్నారు


వృధ్దాశ్రమ భవనం ప్రారంభోత్సవానికి సినీ నటిమణులు పాల్గొన డంతో తిలకించేందుకు పెద్ద ఎత్తున మహిళా అభిమానులు పాల్గొన్నారు. సెలబ్రిటీల తో ఫోటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. దీంతో ఆశ్రమ ప్రాంగణం కోలాహలంగా మారింది. అభిమానులు తమ ఫోన్లకు పని పెట్టి సెలబ్రిటీలకు ఫోటోలు తీసి బందిం చా రు.

 సుమ అధ్యక్ష్యతన

సుమ అధ్యక్ష్యతన

ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ అధ్యక్షత వహించగా నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, 3వ డివిజన్ కార్పో రేటర్ కొణకంచి సరళ, కార్పోరేటర్లు నాగండ్ల కోటి, కొణకంచి వరప్రసాద్, 2వ డివిజన్ టీఆర్‌ఎస్ అద్యక్షుడు నర్రా యల్లయ్య, ప్రధాన కార్యదర్శి కుర్రా మాధవ రావు, భుక్యా భాషా, ఎండీ ఫయాజ్, మహమ్మద్, యూత్ అద్యక్షుడు షేక్ వలీ, హెచ్ ప్రసాద్, 27వ డివిజన్ నాయకులు బుర్రి వినయ్ కుమార్, కుర్రా భాస్కర్ రావు, లక్ష్మణ్ నాయక్, తీగల సతీష్, కాంగ్రెస్ నాయకులు చిలుమూరి కోటి, బోయి న సురేష్, బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, శీలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 ఫేస్ బుక్ లో ఈ విషయమై..

ఫేస్ బుక్ లో ఈ విషయమై..


ఈ విషయమే యాంకర్ సుమ తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

English summary
Laxmi Manchu & Suma Kanakala launched Jesus old age home at Khammam. Suma revealed that Prabhas, Pawan Kalyan, Sp, Ali and many tollywood celebrities donated money for it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu