twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కడలి' లో తన పాత్ర గురించి లక్ష్మీ ప్రసన్న

    By Srikanya
    |

    దరాబాద్ : తమిళ హీరో కార్తీక తనయుడు గౌతమ్, మాజీ హీరోయిన్ రాధ రెండవ కూతురు తులసి లని పరిచయం చేస్తూ మణిరత్నం రూపొందించిన చిత్రం 'కడలి' . ఈ చిత్రంలో లక్ష్మి ప్రసన్న నటిస్తోంది. ఈ చిత్రంలో నటించటంపై ఆమె చాలా ఉత్సాహంగా ఉంది. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మణిరత్నం, మనోహర్ ప్రసాద్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    మంచు లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ... మణిరత్నం దర్శకత్వంలో నేను నటించిన 'కడలి' శుక్రవారం రిలీజవుతోంది. నాది చిన్న పాత్రే. ఓ పాట, ఓ సీన్ మాత్రమే ఉన్నాయి. వాటి కోసమే 22 రోజులు పనిచేశా. అయితేనేం.. మణిరత్నం దర్శకత్వంలో చేసినందుకు ఓ పెద్ద కల నిజమైనంత ఆనందంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

    మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది. మంచు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.

    సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు. తాజాగా ఈచిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 1న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Laxmi prasanna Says her Character in Kadali is very small. But she is very much happy about that Scenes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X