»   » బాలాజీ, సాయిబాబా కాదు...పవన్ కళ్యాణే దేవుడు : వర్మ

బాలాజీ, సాయిబాబా కాదు...పవన్ కళ్యాణే దేవుడు : వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ గురించి ఈ మధ్య సోషల్ నెట్వర్కింగులో తెగ ట్వీట్లు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ.....నిన్న పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ జన సేన సందర్భంగా ఇచ్చిన స్పీచ్ విన్న తర్వాత మరో సంచలన ట్వీట్ చేసారు. 'నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ పవన్ కళ్యాణ్ దేవుడిలా కనిపిస్తున్నారు. తెలుగు ప్రజలకు మొదడు ఉంటే బాలాజీ, సాయిబాబా లాంటి వారిని వదిలేసి పవన్ కళ్యాణ్‌ను పూజించండి' అంటూ ట్వీట్ చేసాడు.

Pawan Kalyan - RGV

ఇంతకు ముందు కూడా వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. .'జన సేన కంటే గొప్ప పేరు ఒక పార్టీకి ఉండే అవకాశం లేదు. శివ సేన కన్న 1000 రెట్లు బెటర్. పేరులోనే ఇంతుంటే పార్టీలో ఎంతుంటుందో. ప్రజారాజ్యం‌లో జరిగిన అవకతవక పనులు జనసేన పార్టీలో అసలు జరుగవని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. పవన్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు కనుక జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించే తెలివి తెలుగువాళ్లకి ఉందని ఆశిస్తున్నాను' అంటూ వర్మ ట్వీట్ చేసారు.

'నా ఉద్దేశ్యంలో తెలివి, నీతి, అభిమానం, పౌరుషం ఉన్నవాడెవడైనా సరే కేవలం పవన్ కళ్యాణ్ జనసేనకే ఓటు వేస్తాడు. జన సేన కేవలం కొత్తగా వస్తున్న ఇంకో పార్టీ అనుకుంటే బుద్ది తక్కువ మూర్ఖత్వం, జనసేన జనం కోసం, పవన్ సేన సృష్టిస్తున్న ఒక ప్రభంజనం' అని వర్మ వ్యాఖ్యానించారు.

English summary
"I dont believe God but Pawan sure appeared like one nd if telugu ppl have any brains thy shud leave Balaji,saibaba etc nd just follow Pawan" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu