»   » మీడియా అంటే ఇదేరా...ప్రీతిజింతా ఫైర్

మీడియా అంటే ఇదేరా...ప్రీతిజింతా ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ప్రీతీ జింతా మరో వారంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో నిన్న ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను ఆమె తోసిపుచ్చారు. తానిప్పుడే పెళ్లి చేసుకోవట్లేదని ఆమె వెల్లడిస్తూ ట్వీట్ చేసారు.


‘నా పెళ్లి తేదీని నేనే ప్రకటిస్తాను. అప్పటిదాకా నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్‌. నా వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి పుకార్లను ఆపండి' అంటూ ప్రీతి ట్వీట్‌ చేశారు.
Leave my marriage announcement to me, says Preity Zinta about her wedding rumours

అమెరికాకు చెందిన ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌ జీన్‌ గుడ్‌ఇనో , ప్రీతీజింతా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 12 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు లాస్‌ఏంజెల్స్‌లో వీరి వివాహ వేడుకలు ఘనంగా జరగనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.

గతంలో ఇలాంటి ఈ పెళ్లి విషయమై స్పందిస్తూ ప్రీతిజింతా అవన్నీ రూమర్సే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఈ విషయమై ప్రీతీ ఇప్పటికీ మీడియాకి దూరంగానే ఉంది. తాజాగా మరోసారి ఈ రూమర్స్ పై ప్రీతి మండిపడ్డారు.

English summary
"Really? I think you should shut down your paper or carry real news! I am actually fed up of manufactured news. Can you leave my marriage announcement to me please after all its my life till then leave me alone," Preity tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu