twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజయ్ దత్‌పై మరో కేసు.. లీగల్ యాక్షన్!

    నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యానికి కారణమయ్యాడనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ముంబైలోని పాలిహిల్స్ లోని పొరిగింటి వాళ్లు సిద్ధమవుతున్నారు.

    By Rajababu
    |

    బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ తన స్నేహితులకు ఇటీవల ఇచ్చిన విందు ప్రస్తుతం అతని మెడకు చుట్టుకొనేలా కనిపిస్తున్నది. పలుమార్లు కోరినా లౌడ్ స్పీకర్లను కట్టివేయకుండా ఆ ప్రాంతవాసులను డిస్ట్రబ్ చేసినందుకు సంజయ్‌పై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యానికి కారణమయ్యాడనే ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు పాలిహిల్స్ లోని పొరిగింటి వాళ్లు సిద్ధమవుతున్నారు.

    వివాదంగా మారిన సంజయ్ దత్ విందు

    వివాదంగా మారిన సంజయ్ దత్ విందు

    ముంబైలోని విలాసవంతమైన పాలి హిల్స్ లో నివసిస్తున్న సంజూబాబా కొద్దిరోజుల క్రితం తన ఇంటి టెర్రస్‌పై భారీ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా పార్టీ తగినట్టుగానే రాత్రంతా లౌడ్ స్పీకర్లలో మ్యూజిక్‌తో ఆ ప్రాంతానంతా హోరెత్తించారు. రాత్రంతా ఆ శబ్దాలతో విసిగిపోయిన పాలిహిల్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ పోలీసులకు పలుమార్లు పోలీసులకు ఫోన్ చేసి మ్యూజిక్ ఆపాలని ఫిర్యాదు చేశారు. దీంతో లౌడ్ స్పీకర్లను ఆపివేయాలని సంజయ్ దత్ ను కోరినా ఫలితం లేకపోయింది. చివరకు సంజూబాబాపై కేసు నమోదు చేశారు.

    సంజయ్ తీరుపై పోలీసుల ఉదాసీనత

    సంజయ్ తీరుపై పోలీసుల ఉదాసీనత

    ఈ వ్యవహారంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన సంజయ్ దత్ పై చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకాడటంతో కాలనీ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ అమితావ్ శుక్లా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ నటుడిపై పోలీసులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని పొరుగింటి వాళ్లు ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీసులపై మండిపడుతున్నారు.

    12 తేదీ తర్వాత లీగల్ నోటీసులు

    12 తేదీ తర్వాత లీగల్ నోటీసులు

    సంజయ్ దత్ వ్యవహార శైలిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామని చైర్మన్ శుక్లా తెలిపారు. ఈ నెల 12న అసోసియేషన్ వార్షిక సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకొని ఖల్ నాయక్‌కు నోటీసులు పంపుతామని స్పష్టం చేశారు. ఈ వివాదంలో సంజయ్ దత్ చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    భూమి చిత్రంతో ఖల్ నాయక్ రీ ఎంట్రీ

    భూమి చిత్రంతో ఖల్ నాయక్ రీ ఎంట్రీ

    ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవించి సంజయ్ ఇటీవలే పూణెలోని ఎర్రవాడ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. జైలు జీవితం అనంతరం ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో భూమి అనే చిత్రంలో నటిస్తున్నారు. గతంలో పలు కేసుల్లో చిక్కుకున్న సంజయ్ పై తాజాగా మరో వివాదం తలెత్తడం గమనార్హం.

    సంజుబాబా జీవితంపై బయోపిక్

    సంజుబాబా జీవితంపై బయోపిక్

    బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడిన సంజయ్ దత్ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజు హిరాణి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ పాత్రలో రణ్‌బీర్ నటిస్తున్నాడు. సంజయ్ తల్లి నర్గీస్‌ పాత్రను మనీషా కోయిరాలా పోషిస్తున్నారు

    English summary
    Mumbai's Pali hill residents' association is going to take action on Bollywood actor Sanjay Dutt. There is allegation that he has been reportedly hosting lavish and loud parties on the terrace of the building at Pali Hill which cause disturbance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X