»   » హాట్ అనసూయతో ‘లెజెండ్’, ఏర్పాట్లు అదిరాయ్ (ఫోటోలు)

హాట్ అనసూయతో ‘లెజెండ్’, ఏర్పాట్లు అదిరాయ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'లెజెండ్' ఆడియో వేడుకకు ఏర్పాట్లు ఘనంగా చేసారు. శిల్పకళా వేదికలో ఈ రోజు సాయంత్రం 7.33 గంటలకు ఆడియో ఆవిష్కరణ జరుగనుంది. ఈ వేడుకకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు తరలి వస్తున్నారు.

సింహా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టెనర్ 'లెజెండ్'. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయి కొర్రపాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సొనాల్ చౌహాన్ నాయికలు. మ్యూజిక్ మిస్సైల్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్న ఈచిత్రం ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ 'లహరి మ్యూజిక్' భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు.

లెజెండ్ ఆడియో

లెజెండ్ ఆడియో

శిల్ప కళా వేదిక వద్ద ఏర్పాటు చేసిన లెజెండ్ మూవీ హోర్డింగులు. బాలయ్య లుక్ అదరిపోయేలా ఉందని అభిమానులు అంటున్నారు.

లెజెండ్ ఆడియో

లెజెండ్ ఆడియో

ఈ చిత్రంలో తొలిసారిగా జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనకు సంబంధించిన లుక్ ఇక్కడ చూడొచ్చు.

లెజెండ్ ఆడియో

లెజెండ్ ఆడియో

లెజెండ్ ఆడియో విడుదల వేదిక విద్ద వినూత్న రీతిలో హోర్డింగులు ఏర్పాటు చేసారు.

లెజెండ్ ఆడియో

లెజెండ్ ఆడియో

లెజెండ్ సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన సఫారీ వాహనం. ఆడియో వేదిక వద్ద ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలస్తోంది.

లెజెండ్ ఆడియో

లెజెండ్ ఆడియో

బాలయ్య కోసం ప్రత్యేకంగా హార్లే డేవిడ్సన్ బైకును డిజైన్ చేయించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ఇక్కడ చూడొచ్చు.

లెజెండ్ ఆడియో

లెజెండ్ ఆడియో

లెజెండ్ ఆడియో వేడుక కార్యక్రమానికి హాట్ యాంకర్ అనసూయ యాంకరింగు చేస్తోంది.

English summary
The mass combination of Telugu film industry is Balakrishna, Boyapati Srinu and Devi Sri Prasad’s upcoming movie Legand’s audio is going to release today at Silpa Kala Vedika, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu