»   »  వేడుకలో బాలకృష్ణ వెలిగిపోయాడు(ఫొటోలు)

వేడుకలో బాలకృష్ణ వెలిగిపోయాడు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కి సంచలన విజయం అందుకున్న చిత్రం 'లెజెండ్‌'. ఈ చిత్రం ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ 50 రోజుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ, చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు పలువురు యూనిట్‌ సభ్యులు హాజరయ్యారు. యూనిట్‌ సమక్షంలో బాలకృష్ణ బర్త్‌ డే కేక్‌ కోశారు.

ఈ సంవత్సరం బాలకృష్ణ పుట్టిన రోజుకు చాలా విశేషాలున్నాయి. ఇదే రోజు 'లెజెండ్' సినిమా 75 రోజులు పూర్తి చేసుకోవడం ఒక విశేషమైతే, సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మొదటిసారి చేసుకుంటున్న పుట్టిన రోజు కావడం మరో విశేషం.

'లెజెండ్' సినిమా సూపర్ హిట్ అవడం, ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడంతో ఫుల్ జోష్‌మీదున్నారు బాలకృష్ణ. జన్మదిన వేడుకల్లో చాలా ఉత్సాహంగా కనిపించారు. అభిమానుల అభినందనల్ని ఓపిగ్గా స్వీకరించారు. తర్వాత 'లెజెండ్' యాభై రోజుల వేడుకలో పాల్గొన్నారు.

గత వైభవం...

గత వైభవం...

'లెజెండ్' చిత్రం బాలయ్యకు గత వైభవం తెచ్చి పెట్టింది. బోయపాటి శ్రీను కసితో చేసిన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోయింది.

గెటప్ అదుర్స్..

గెటప్ అదుర్స్..

సినిమాలో లెజండ్ బాలయ్య గెటప్ కు భారీ స్పందన వచ్చింది. తన వయస్సు కు తగ్గ పాత్రలో బాలయ్య కనపడి అదరకొట్టారు.

డైలాగులు..

డైలాగులు..

"గన్ తో బెదిరిస్తే ,బెదిరిపోవడానికి వోటర్ ని కాదు బే, షూటర్ ని ." అంటూ లెజండ్ గా బాలయ్య చెప్పే డైలాగులతో థియోటర్స్ మారు మ్రోగిపోయాయి.

యాభై కోట్లు..

యాభై కోట్లు..

"లెజెండ్'' చిత్రం మాస్ తో పాటు క్లాస్ ఫ్యామిలీ అడియెన్స్ ను కూడా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యాభై కోట్లు వచ్చాయని, ఈరేర్ ఫీట్ తాజా చిత్రం "లెజెండ్'' ద్వారా సాధించారని స్వయంగా ఆ చిత్ర నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు.

రిలీజ్ రోజు..

రిలీజ్ రోజు..

బాలకృష్ణ హీరోగా రూపొందిన లెజెంబ్ సినిమా మార్చి 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. రిలీజ్ రోజు అన్ని చోట్లా పండుగ వాతావరణం కనిపించింది.

పరిశ్రమకు ఊపిరి

పరిశ్రమకు ఊపిరి

ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అన్న సినిమా విశ్లేషకుల అంచానాలను నిజం చేస్తూ 50 కోట్ల పై చిలుకు వసూళ్ళు సాధించిన లెజెండ్ చిత్రం 2014వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసింది.

హైలెట్స్..

హైలెట్స్..

నందమూరి బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణల తీరు,భోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ప్ నిర్మాణ విలువలు హైలెట్ గా నిలిచాయి.

సంగీతం

సంగీతం

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఐదో సినిమాకే...

ఐదో సినిమాకే...

ముఖ్యంగా బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం.

కేరింతలు

కేరింతలు

2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్‌'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు. ఈ క్రెడిట్‌ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే.

సింహ గర్జన

సింహ గర్జన

బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు.

సెంటిమెంట్ కలిసివచ్చింది.

సెంటిమెంట్ కలిసివచ్చింది.

కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్‌ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది.

సెకండాఫ్ లో...

సెకండాఫ్ లో...

ముఖ్యంగా సెకండాఫ్ లో సెంటిమెంట్‌, ట్రెయిన్‌ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి.

మాస్ యాక్షన్ ప్రియులకు...

మాస్ యాక్షన్ ప్రియులకు...

గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దిందని అంతటా వినపడుతోంది. మాస్‌ యాక్షన్‌ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.

రాజకీయ డైలాగులు

రాజకీయ డైలాగులు

రాజకీయాలు పుట్టిందే మా వంశంలో రా.. అని బాలయ్య గర్జించిన తీరు విశ్వనటసా ర్వభౌముడు ఎన్టీఆర్‌ని తలపించింది. లెక్కకు మిక్కిలిగా బాలయ్య విసిరిన పంచ్‌లకు థియేటర్లలో విజిల్స్‌ పడ్డాయి.

అంతటా...

అంతటా...

ఈ సినిమా ఏపీతో పాటు చెన్నయ్‌, బెంగళూరు, విదేశాల్లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది.

ఓవర్ సీస్ లోనూ..

ఓవర్ సీస్ లోనూ..

కేవలం ఆంధ్ర-తెలంగాణా ప్రాంతాల్లో నే కాకుండా ఓవర్ సీస్ లోనూ "లెజెండ్'' చిత్రం విజయఢంకా మ్రోగించింది

బాలకృష్ణ మాట్లాడుతూ ....

బాలకృష్ణ మాట్లాడుతూ ....

"నందమూరి వంశంలో పుట్టడం నా అదృష్టం. నాన్నగారు, ఆయన అభిమానులు అందించిన ప్రోత్సాహంతోనే వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అందరి ఆదరణ పొందాను. అభిమానులందరికీ థాంక్స్. ఎమ్మెల్యేగా ఉన్నా సినిమాలు చేస్తూనే ఉంటాను. ' అన్నారు.

వందో చిత్రం...

వందో చిత్రం...


ఈ మధ్యే నా 99వ చిత్రం ప్రారంభమైంది. తొందర్లోనే మీ ముందుకు రానున్న నా వందో చిత్రం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది అని బాలయ్య చెప్పారు.

ప్రజలే ముఖ్యం

ప్రజలే ముఖ్యం

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల కన్నా ప్రజలే ముఖ్యం నాకు. తరువాతే సినిమాలు. మంత్రి వర్గంలో చేరమని చంద్రబాబు అడిగినా నేనే చేరలేదు. ఎందుకంటే ఒక ప్రజా నాయకుడిగా నిర్వర్తించాల్సిన పనులు చాలా ఉన్నాయి

English summary
Legend, the Telugu movie starring Balakrishna, achieved a grand success in the recent times and has just completed 50 days. The film unit has celebrated the 50days function in sync with Balakrishna’s birthday. Dasari Narayana Rao has attended the function as the Chief Guest. Balakrishna cut the cake before the film unit members. Boyapati Sreenu, the director of the movie, and many others were present at the function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu