For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బాలకృష్ణ ‘లెజెండ్’...ట్వీట్ రివ్యూ

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. సింహా తర్వాత నాలుగైదు సినిమాలు చేసినా బాలయ్య అభిమానులు ఊహించిన విజయం మాత్రం దక్కలేదు. అయితే ఈ సారి 'లెజెండ్' చిత్రం ద్వారా ఆ కసి తీరడం ఖాయంగా కనిపిస్తోంది.

  బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా తెరకెక్కించిన 'లెజెండ్' చిత్రం ఈ రోజు గ్రాండ్ విడుదలైంది. బాలయ్య అభిమానులు కోరుకునే కమర్షియల్ మసాలా అంశాలను బాగా దట్టించి ఈచిత్రాన్ని తెరకెక్కించారు బోయపాటి.

  బోయపాటి సినిమాల్లో పేలే పంచ్ డైలాగులు...ఈచిత్రంలో మరోసారి పేలనున్నాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్. ఇక బ్రహ్మానందం కామెడీతో, హంసా నందిని ఐటం సాంగులో ఆకట్టుకోనున్నారు. రామ్ లక్ష్మణ్ హై ఓల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమా ఓ రేంజిలో వచ్చేలా సహకరించాయి. ఇక ఈ సినిమాలో జగపతి బాబు తొలిసారిగా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన బాలయ్య హీరోయిజానికి ధీటుగా క్రూరమైన విలనిజాన్ని పండించారు. బాలయ్య సరసన సోనాల చౌహాన్, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

  స్టోరీ విషయానికొస్తే.....జయ్‌దేవ్‌ (బాలకృష్ణ) వ్యక్తిత్వపరంగా నియంతలాంటివాడు. నియంత అంటే ఎప్పుడూ అధికారం గురించి ఆలోచిస్తాడు. కానీ జయ్‌దేవ్‌ మాత్రం ప్రజల కోసం ఆలోచిస్తాడు. సమాజం తరవాతే ఏదైనా. తనను నమ్ముకొన్నవాళ్లకు అన్యాయం జరిగితే సహించడు. దీంతో పాటు కుటుంబం అంటే ప్రాణం. తన క్రమశిక్షణ వల్ల ఏం సాధించాడు? ఏం కోల్పోయాడు? అసలు ఈ ప్రయాణంలో లెజెండ్‌గా ఎలా ఎదిగాడు? అన్నదే ఈ చిత్రకథ. జితేందర్‌ (జగపతిబాబు)తో ఆయనకున్న పగ ఏమిటన్నదీ ఆసక్తికరం.

  ఇప్పటికే అభిమానులు ప్రీమియర్ షోలోలు చూసి సినిమా ఎలా ఉందనే విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వాటిపై ఓ లుక్కేద్దాం.

  Mahesh S Koneru ‏@smkoneru

  Mahesh S Koneru ‏@smkoneru

  బాలయ్య ఇంట్రడక్షన్ బాగుంది. టైం బాంబ్ సాంగులో బాలయ్య డాన్స్ రాకింగ్. జగపతి బాబు విలనిజం, ఆయన్ను తెరపై చూపించిన తీరు సినిమాకు వన్నె తెచ్చింది.

  Soma Sekhar ‏@Tollywood_King

  Soma Sekhar ‏@Tollywood_King

  సెకండాఫ్ లో బాలయ్య పెర్ఫార్మెన్స్ సూపర్. సాంగ్స్ ఓకే. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గుడ్. రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ సూపర్బ్.

  Survi ‏@PavanSurvi

  Survi ‏@PavanSurvi


  ఫస్టాఫ్ కొంత స్లోగా ఉంది కానీ ఇంటర్వెల్ పాయింట్ హైలెట్.

  Survi ‏@PavanSurvi

  Survi ‏@PavanSurvi

  రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉంది బ్లడీ ఫూల్....ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత బాలయ్య క్యారెక్టర్ సాలిడ్‌గా ఉంది.

  Nagaraja Reddy ‏@NagarajaReddyS

  Nagaraja Reddy ‏@NagarajaReddyS


  జగపతి బాబును తెరపై చూపించిన తీరు చాలా బాగుంది. ఈ చిత్రం ఆయనకు కెరీర్ పరంగా బాగా ప్లస్సవుతుంది.

  Kvp Pradeep ‏@cinema_babu

  Kvp Pradeep ‏@cinema_babu


  ఇంటర్వెల్ డైలాగ్స్ బాగున్నాయి. సినిమాలో బాలయ్య డాన్స్ సూపర్. సినిమా అందరికీ నచ్చుతుంది.

  @pavan1230

  @pavan1230

  లెజెండ్ సినిమా సూపర్ హిట్. సెకండాఫ్ చాలా బాగుంది.

  English summary
  Almost two years after the release of Srimannarayana, Nandamuri Balakrishna has made a grand comeback with his latest movie Legend, which has hit the screens across the globe today (March 28). The actor has teamed up with director Boyapati Srinu, who has earlier given him a big break with Blockbuster film Simha. The duo have together made sure that they rock the viewers again.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more