»   »  షాకిస్తున్న మహానటి రన్ టైమ్.. ఆ నమ్మకంతోనే!

షాకిస్తున్న మహానటి రన్ టైమ్.. ఆ నమ్మకంతోనే!

Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య కాలంలో వస్తున్న చిత్రాలు తక్కువ రన్ టైం తో వస్తున్నాయి. రన్ టైమ్ ఎక్కువగా ఉంటె ఆడియన్స్ బోర్ ఫీలవుతారని దర్శకులు ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నారు. అందుకే వీలైనంత ఎక్కువగా ఎడిటింగ్ లో సినిమాని తొలగించాడనికి ప్రయత్నిస్తుంటారు. కానీ రన్ టైం ఎక్కువగా ఉన్నప్పటికీ సీన్ ఈమెలో సత్తా ఉంటే ప్రేక్షక ఆదరణ ఉంటుందనేది ఇదివరకు రుజువైన అంశం.

బుధవారం భారీ విడుదలకు సిద్ధం అవుతున్న సావిత్రి బయోపిక్ చిత్రం మహానటి రన్ టైం షాక్ ఇచ్చే విధంగా ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు నాగ అశ్విన్ 176 నిమిషాల రన్ టైం లాక్ చేసాడని సమాచారం. అంటే దాదాపుగా మూడు గంటలు. ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువ రన్ టైంతో ఏ చిత్రమూ రాలేదు.

Lengthy run time for MahaNati.

సావిత్రి బాల్యం నుంచి ఆమె మరణించే వరకు జరిగిన ఆసక్తి కర అంశాలన్నింటినీ ఈ చిత్రంలోకి చూపించబోతుండడం వలన ఎక్కువ రన్ టైం ఉంటుందని అంటున్నారు. సావిత్రి జీవిత చరిత్రపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి , అన్ని పాత్రలని నాగ అశ్విన్ మలచిన విధానం ఈ చిత్రానికి బలం అని, ఈ అంశాలే మూడు గంటల పాటు ప్రేక్షకులని థియేటర్ లలో కట్టిపడేస్తాయని అంటున్నారు.

English summary
Lengthy run time for MahaNati. Mahanati world wide grand release tomorrow
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X