శ్రీదేవి తరహా భారీ విషాదం: గతంలో ఆ ఇద్దరు హీరోయిన్ల విషయంలోనూ!

By Bojja Kumar

Recommended Video

Actresses Who Left Us Too Soon

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తాన్ని విషాదంలోకి నెట్టి వేసింది. ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో అయితే ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో శ్రీదేవి చెరగని ముద్ర వేశారు. అందుకే శ్రీదేవి మరణం దక్షిణాదిన భారీ విషాదంలా మారింది. గతంలో దక్షిణాది ఇండస్ట్రీ మొత్తాన్ని ఈ తరహాలో కుదిపేసిన విషాదాలు ఇద్దరు స్టార్ హీరోయిన్ల మరణం సమయంలో చోటు చేసుకున్నాయి.

 ఇద్దరు కూడా తక్కువ వయసులోనే

ఇద్దరు కూడా తక్కువ వయసులోనే

శ్రీదేవి 54 ఏళ్ల వయసులోనే మరణించారు. ఆమె మరణాన్ని సినీ ప్రేమికులు జీర్ణించుకోలేక పోతున్నారు. గతంలో దక్షిణాది స్టార్ హీరోయిన్లు సావిత్రి, సౌందర్య కూడా శ్రీదేవి తరహాలోనే అభిమానులను శోకసముద్రంలో ముంచెత్తి వెళ్లిపోయారు.

శ్రీదేవి కంటే తక్కువ వయసులోనే

శ్రీదేవి కంటే తక్కువ వయసులోనే

ప్రముఖ నటి, దక్షిణాది స్టార్ హీరోయిన్ సావిత్రి 47 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఇక సౌత్‌లో తిరుగులేని హీరోయిన్‌గా తన సత్తా చాటిన సౌందర్య కేవలం 34 ఏళ్ల వయసులోనే ఓ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

 లెజెండరీ యాక్టర్ సావిత్రి

లెజెండరీ యాక్టర్ సావిత్రి

సావిత్రి ‘సంసారం' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. తర్వాత పలు తెలుగు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. ‘పెళ్లి చేసి చూడు' అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా మారారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పట్లో ఆమె సౌత్ సూపర్ స్టార్లందరి సరసన నటించారు. పలు చిత్రాల్లో తనే ప్రధాన పాత్రగా చేశారు.

చివరి రోజుల్లో దారుణంగా

చివరి రోజుల్లో దారుణంగా

జెమిని గణేశన్‌తో వివాహం తర్వాత సావిత్రి జీవితం ఊహించని మలుపు తిరిగింది. కారణం ఏమిటో తెలియదుకానీ తాగుడుకు బానిసయ్యారు. చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యానకి గురై ఎవరూ గుర్తు పట్టని విధంగా మారిపోయి మరణించారు. తెలుగు సినీ రంగంలో రారాణి గా వెలుగొంది ఆమె అలా మరణించడం అభిమానులను కలిచి వేసింది.

 చిన్న వయసులో మరణించిన సౌందర్య

చిన్న వయసులో మరణించిన సౌందర్య

సౌత్‌ స్టార్ హీరోయన్‌గా వెలుగొందుతున్న రోజుల్లో సౌందర్య ఓ ప్రమాదంలో మరణించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. 1992లో గాంధర్వ అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన సౌందర్య అతి తక్కువ కాలంలోనే తన అందం, నటనతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి టాప్ హీరోలతో తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. సౌందర్య మరణం కూడా అప్పట్లో సౌత్ చిత్ర పరిశ్రమలో భారీ విషాదంగా మిగిలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X