»   » అల్లు అర్జున్ కి అచ్చిరాని ముద్దు సీన్లు!

అల్లు అర్జున్ కి అచ్చిరాని ముద్దు సీన్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ చిత్రాలలో తప్పనిసరిగా ఉండే ముద్దు సీన్లు ఇప్పుడు టాలీవుడ్ ను కూడా ముద్దులతో ముంచెత్తుతున్నాయి. బాలీవుడ్ హీరోలు ఉత్తుత్తి ముద్దులు పెడితే, టాలీవుడ్ లో మాత్రం ఒరిజినల్ ముద్దు సీన్ తోనే సినిమా విజయం పొందాలి అనేంతగా తెరపై ఆ సీన్ ను పండిస్తున్నారు. ఈ ముద్దు సీన్ లకు మంచి ఊపు ఇచ్చిన తార ఎవరంటే ముందుగా వినబడేది నయనతార పేరే శింబుతో ఆమె ముద్దుతోపాటు పెదవిని కూడా కొరికొంచుకొని ఆ సీన్ కు ప్రాణం పోసిందని అప్పట్లో వార్తలు. ఆ తర్వాత దాదాపు ప్రతి చిత్రంలో ముద్దు సీన్ సహజంగా మారిపోయింది.

అయితే 'ఏ మాయ చేసావె" చిత్రంలో విచ్చల విడి ముద్దులతో సినిమాను తడిపేశారు..చైతూ, సమంతలు.. అది ఒకవిధంగా ఓకే అనిపించినా రీసెంట్ గా రిలీజైన అల్లు అర్జున్ 'వరుడు" చిత్రం మొత్తం ఆ ముద్దు సీన్ పై ఆధారపడినట్టుగా గుణశేఖర్ చిత్రీకరించాడు. ఇందులో విశేషమేమంట ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల నడుమ వచ్చే ఆ ముద్దు సీన్ తప్ప ఏమి లేకపోవడము లిప్ లాక్ లోని గాఢతను తెలియజేసిందంటున్నారు. కనీసం ఈ ముద్దు సీన్ 20 సెకన్లు ఉండటమే దీనికి కారణం...

అయితే ఆర్య2 లో లిప్ట్ లో లిప్ కిస్, వరుడులోని ఫెవికల్ లిప్ కిస్ పెట్టిన అల్లు అర్జున్ కి ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ కి, లిప్ కిస్ సయోద్య కుదరడం లేదని అంతటా చర్చించుకొంటున్నారు. మరైతే అల్లు అర్జున్ ముందు ముందు తీయబోయే చిత్రాలలోనైనా ముద్దు సీన్లు లేకుండా జాగ్రతపడుతాడో లేక ఇలాంటి సెంటిమెంట్లు నమ్మననీ కొట్టి పడేస్తాడో మరి. మరైతే బృందావనం, డార్లింగ్, గోలిమార్ చిత్రాలు కూడా ముద్దులతో తడిసి 'ముద్ద"వ్వడానికి సిద్దంగా ఉన్నారో లేదా అల్లు అర్జున్ లాగా అదష్టాన్ని పరీక్షించుకోనున్నారో వేచి చూద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu