Don't Miss!
- News
girl: కాలేజ్ అమ్మాయి మీద జరదా బీడా ఉమ్మేశాడు. అమ్మాయి ముఖం మీద కత్తితో ?
- Sports
IND vs NZ: హార్దిక్ పాండ్యా.. ఇంత స్వార్థమా? నీ దోస్తుల కోసం పృథ్వీ షాను పక్కనబెడతావా? ఫ్యాన్స్ ఫైర్
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
నా భర్త పాకిస్థానీ కాదు: బాలీవుడ్ హీరోయిన్ లీసా
వివాహం చేసుకుని భర్తతో సుఖసంతోషాలతో గడపాలనుకున్న హీరోయిన్ లిసా హెడాన్ తీవ్ర విమర్శల పాలైంది. హౌస్‌ఫుల్-2, 'క్వీన్' వంటి బాలీవుడ్ సినిమాలతో ఆకట్టుకున్న లిసా ఏడాదినుంచి డేటింగ్ చేస్తున్న ప్రియుడు డినో లల్వానీని వివాహం చేసుకుంది. తన పెళ్లి విషయాలను ఫొటోలు, వీడియోలతో సహా సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంత వరకు బాగానే ఉంది కానీ.. ఆమె పెళ్లి చేసుకున్న వాడు పాకిస్థానీ అంటూ సోషల్ మీడియాలో దుమారం రేగింది.

డినో లల్వానీ తండ్రి గులు లల్వానీ పాకిస్థాన్ లో జన్మించిన వ్యాపారవేత్త కావడంతో, అసలు సమస్య మొదలైంది. ఆమె భర్త పాకిస్థానీ అంటూ ఆమె వివాహంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి.లిసా భర్త డినో లల్వానీ తండ్రి గులు లాల్వానీ పాకిస్థాన్ లో జన్మించాడు. బ్రిటన్ లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. ఐతే సోషల్ మీడియాలో లిసా పెళ్లి ఫొటోలు చూసిన వాళ్లలో ఎవరో డినో తండ్రి పాకిస్థానీ కాబట్టి.. డినో కూడా పాక్ మూలాలున్న వాడే అన్న వాదన తెచ్చారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో లిసా.. ఒక పాకిస్థానీని పెళ్లాడిందంటూ వివాదం రాజేశారు. దీంతో లిసాకు లేనిపోని తలనొప్పి మొదలైంది.
లిసా భర్త డినో లల్వానీ తండ్రి గులు లాల్వానీ పాకిస్థాన్ లో జన్మించాడు. బ్రిటన్ లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. ఐతే సోషల్ మీడియాలో లిసా పెళ్లి ఫొటోలు చూసిన వాళ్లలో ఎవరో డినో తండ్రి పాకిస్థానీ కాబట్టి.. డినో కూడా పాక్ మూలాలున్న వాడే అన్న వాదన తెచ్చారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో లిసా.. ఒక పాకిస్థానీని పెళ్లాడిందంటూ వివాదం రాజేశారు. దీంతో లిసాకు లేనిపోని తలనొప్పి మొదలైంది.

30 ఏళ్ల లిసా హేడన్ చైన్నైలో జన్మించింది. మోడల్ గా, ఫ్యాషన్ డిజైనర్ గా రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ ఫుల్-3, క్వీన్, శాంటా బాంటా, యే దిల్ హై ముష్కిల్ లాంటి సినిమాల్లో నటించింది. పాపం ఇప్పుడు ఈ కొత్త వివాదం తో పెళ్ళి ఆనందం కాస్తా ఆవిరయినట్టుంది పాపం... హనీమూన్ కూడా అవ్వకుండానే మరీ ఇంతలా వివాదాస్పదం అవ్వటం ఎవ్వరికైనా భాదే కదా.