ముంబైలో ‘బిజినెస్’ డీల్ కి మహేష్ రెడీ...!

By Sindhu

మహేష్ బాబు కథానాయకుడుగా పూరీ జగన్నాథ్ 'ది బిజినెస్ మేన్" పేరిట ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన డైలాగ్ వెర్షన్ ను దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవలే పూర్తి చేశారు. మామూలుగా తన ప్రతి చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును బ్యాంకాక్ వెళ్లి రాసుకుంటారాయన. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా అక్కడే పూర్తి చేసుకుని వచ్చారు.

కాగా, సినిమా షూటింగుకి సంబంధించిన లొకేషన్ల ఎంపిక కోసం పూరిజగన్నాథ్ నిన్న ముంబై బయలుదేరి వెళ్లారు. ఈ సినిమా షూటింగు ఎక్కువ భాగం ముంబైలోనే ప్లాన్ చేస్తున్నారాయన. కాజల్ కథానాయికగా నటించే ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న 'దూకుడు' సినిమా పూర్తయ్యాక ఇది మొదలవుతుందని అంటున్నారు. మహేష్ సరసన కాజల్ తొలిసారిగా నటిస్తోందన్నమాట!

ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక డైనమిక్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఇటువంటి పాత్ర ఇంతకుముందెన్నడూ చేయలేదని, ఈ చిత్రంలో మహేష్ పాత్ర హైలెట్ అంటున్నారు. ఈ చిత్రంషూటింగ్ త్వరలో ప్రారంమై సంక్రాంతి రోజు12 ,2012కి సనిమా విడుదలకు ప్లాన్ చేసే విధంగా షూటింగ్ ను వేగవంతం చేయదలచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X